Movies"మహానటి" సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్.. ఫైనల్లీ...

“మహానటి” సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్.. ఫైనల్లీ ఎలా ఒప్పించారంటే..!

టాలీవుడ్ మహానటి గా  పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఈ సినిమా ద్వారానే అమ్మడు తన పేరుని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మార్చేసుకుంది . అంతకుముందు సినిమాలు చేసి హిట్ కొట్టిన సరే అందరికీ కీర్తి సురేష్ పేరు నచ్చింది మాత్రం ఆమె మహానటి సినిమాలో నటించిన తర్వాతే అన్న సంగతి అందరికీ తెలిసిందే .

కాగా నాగ్ అశ్విన్  ఈ సినిమా కథను కీర్తి సురేష్ కు చెప్పగా ఈ సినిమాను 2 టైమ్స్ రిజెక్ట్ చేసిందట.  మొదట ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ ని అనుకున్న నాగ్ అశ్విన్ .. ఇంటికి వెళ్లి స్టోరీ వివరించగా అంతటి లెజెండ్రీ యాక్ట్రెస్ పాత్రలో నేను నటించలేను ..మెప్పించలేను.. అంటూ రిజెక్ట్ చేసిందట . దీంతో ఆ తర్వాత ఈ స్టోరీని నిత్యామీనన్ కి వివరించారట నాగ్ అశ్విన్.. అయితే ఆమె కూడా ఈ పాత్ర రిజెక్ట్ చేయడంతో పలువురు సలహా మేరకు మళ్ళీ కీర్తి సురేష్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ అమ్మ గారి సమక్షంలో ఈ కథను వివరించగా ఇంప్రెస్ అయిపోయిందట కీర్తి సురేష్.

ఆమె  అమ్మగారు మేనక ఈ సినిమాని ఎలాగైనా సరే నువ్వు చేయాల్సిందే అంటూ పట్టుబట్టి మరి ఆమెకు ఇష్టం లేకపోయినా సరే ఈ సినిమాకు సైన్ చేయించిందట. ఆ తర్వాత మెల్లగా ఈ సినిమాతో ప్రేమలో పడిపోవడం మొదలుపెట్టింది కీర్తి సురేష్ . ఇక సావిత్రి గారి గురించి తెలుసుకున్న తర్వాత అమ్మడు ఈ సినిమాకి ఫ్యాన్ అయిపోయింది.  అందుకే సగం సినిమా తర్వాత మహానటిగా తానే లీనమైపోయి నటించి కీర్తి సురేష్ ఇప్పుడు మహానటి అన్న ట్యాగ్ కి న్యాయం చేసింది అన్న కామెంట్లు కూడా దక్కించుకుంటుంది . ఇప్పటికి కీర్తి సురేష్ ని మహానటి గాని అభివర్ణిస్తున్నారు అంటే అదంతా సావిత్రి గారి బయోపిక్ లో నటించిన పుణ్యమనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news