టాలీవుడ్ మహానటి గా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఈ సినిమా ద్వారానే అమ్మడు తన పేరుని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మార్చేసుకుంది . అంతకుముందు సినిమాలు చేసి హిట్ కొట్టిన సరే అందరికీ కీర్తి సురేష్ పేరు నచ్చింది మాత్రం ఆమె మహానటి సినిమాలో నటించిన తర్వాతే అన్న సంగతి అందరికీ తెలిసిందే .
కాగా నాగ్ అశ్విన్ ఈ సినిమా కథను కీర్తి సురేష్ కు చెప్పగా ఈ సినిమాను 2 టైమ్స్ రిజెక్ట్ చేసిందట. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ ని అనుకున్న నాగ్ అశ్విన్ .. ఇంటికి వెళ్లి స్టోరీ వివరించగా అంతటి లెజెండ్రీ యాక్ట్రెస్ పాత్రలో నేను నటించలేను ..మెప్పించలేను.. అంటూ రిజెక్ట్ చేసిందట . దీంతో ఆ తర్వాత ఈ స్టోరీని నిత్యామీనన్ కి వివరించారట నాగ్ అశ్విన్.. అయితే ఆమె కూడా ఈ పాత్ర రిజెక్ట్ చేయడంతో పలువురు సలహా మేరకు మళ్ళీ కీర్తి సురేష్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళ అమ్మ గారి సమక్షంలో ఈ కథను వివరించగా ఇంప్రెస్ అయిపోయిందట కీర్తి సురేష్.
ఆమె అమ్మగారు మేనక ఈ సినిమాని ఎలాగైనా సరే నువ్వు చేయాల్సిందే అంటూ పట్టుబట్టి మరి ఆమెకు ఇష్టం లేకపోయినా సరే ఈ సినిమాకు సైన్ చేయించిందట. ఆ తర్వాత మెల్లగా ఈ సినిమాతో ప్రేమలో పడిపోవడం మొదలుపెట్టింది కీర్తి సురేష్ . ఇక సావిత్రి గారి గురించి తెలుసుకున్న తర్వాత అమ్మడు ఈ సినిమాకి ఫ్యాన్ అయిపోయింది. అందుకే సగం సినిమా తర్వాత మహానటిగా తానే లీనమైపోయి నటించి కీర్తి సురేష్ ఇప్పుడు మహానటి అన్న ట్యాగ్ కి న్యాయం చేసింది అన్న కామెంట్లు కూడా దక్కించుకుంటుంది . ఇప్పటికి కీర్తి సురేష్ ని మహానటి గాని అభివర్ణిస్తున్నారు అంటే అదంతా సావిత్రి గారి బయోపిక్ లో నటించిన పుణ్యమనే చెప్పాలి..!!