ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో – బుల్లితెర స్టార్ సెలబ్రిటీలు ఎక్కువమంది స్టార్స్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు . ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో డబల్ డబల్ గుడ్ న్యూస్ లు అభిమానులకు అందజేశారు . ఈ క్రమంలోనే బుల్లితెరపై పాపులారిటి సంపాదించుకున్న కొంతమంది స్టార్స్ కూడా పెళ్లి చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు.
ఈ క్రమంలోనే బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న జబర్దస్త్ కమెడియన్ కార్తీక్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు . ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు . కెవ్వు కార్తిక్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే ఓ అమ్మాయిని హగ్ చేసుకుని ..అమ్మాయితో దిగిన ఫొటోస్ ని షేర్ చేశాడు కానీ .. అమ్మాయి ఫేస్ ఎక్కడ రివిల్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో అందరూ ఇది లవ్ మ్యారేజ్ అని అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయి అని ..అందుకే సస్పెన్స్ గా ఇలా జాగ్రత్త పడ్డారు అని చెప్పుకొస్తున్నారు .
దీంతో సోషల్ మీడియాలో కెవ్వు కార్తిక్ పెళ్లి న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు “మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు ..బహుశా అది ఇదే కావచ్చు అంటూ ..తన జీవితంలోకి వచ్చిన బ్యూటిఫుల్ గర్ల్ కి థాంక్యు చెప్పాడు..” నీతో కొత్త జీవితాన్ని వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని అనుకుంటున్నాను” అంటూ స్పెషల్ నోట్ ని షేర్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఫొటోస్ పోస్ట్ చేశాడు . దీంతో సోషల్ మీడియాలో కెవ్వు కార్తిక్ కాబోయే వైఫ్ ఎవరు అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది . ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినా..? లేకపోతే తన ఫ్రెండా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు జనాలు . చూద్దాం మరి వీళ్ళ పెళ్లి డేట్ ఎప్పుడు ప్రకటిస్తాడో అమ్మాయి ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తాడో..?