ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రంభ టాలీవుడ్లో 1990వ దశకంలో దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించింది. తన అందంతో అభినయంతో పాటు డ్యాన్స్ తో కూడా తన సత్తా చాటుకుంది. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. జెడి చక్రవర్తి హీరోగా రంభ హీరోయిన్ గా నటించిన బొంబాయి ప్రియుడు సినిమా ద్వారా ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత ఆమె చిరంజీవితో చేసిన హిట్లర్ సినిమా ఆమెను ఇక్కడ స్టార్ హీరోయిన్ లీగ్లో చేర్చేసింది.
ఆ తర్వాత రంభ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంభకు టాలీవుడ్ ఇండస్ట్రీ కన్నా భోజపురి ఇండస్ట్రీలో ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అక్కడ ఆమెను దేవతగా ఆరాధించిన సినీ జనాలు ఆమెకు పూజలు చేసి చిన్న చిన్న గుళ్లు కట్టేవారు. కెరియర్ మంచి ఫామ్ లో ఉండగా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి ఇంద్రకుమార్ అనే మలేషియన్ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది రంభ. అయితే ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ తన ఫేవరెట్ హీరోస్ గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని అతడితో సినిమాలో నటించే ఛాన్స్ దొరికితే మాత్రం వదిలేది లేదంటూ కుండబద్దలు కొట్టేసింది. తన భర్తతో గొడవపడైనా ఎన్టీఆర్ సినిమాలో నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. అయితే ముగ్గురు పిల్లలకు తల్లి కావడంతో హీరోయిన్ ఫిజిక్ కోల్పోయిన రంభ పెద్దవారిలా కనిపిస్తున్నారు.
రంభ ఏ అత్త పాత్రలో లేదా అక్క, అమ్మ, ఆంటీ పాత్రల్లోనే ఇప్పుడు నటించాల్సి ఉంటుంది. ఆమె తెలుగు జనాలకు బాగా తెలిసిన ఫేస్ కావడంతో ఆమె పై పాత్రలు చేస్తే వెంటనే క్లిక్ అయిపోతుంది. సెకండ్ ఇన్సింగ్స్ అదిరిపోతుంది. దీంతో ఈ వార్తలు విన్న నెటిజన్స్ కొంతమంది ఎన్టీఆర్ అంటే మీకు అంత ఇష్టమా ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.