రాజమౌళి ప్రస్తుతం తెలుగులోనే కాకుండా భారతదేశంలోనే గర్వించదగ్గ దర్శకుడిగా మారాడు. ఆయన కీర్తి హాలీవుడ్‌కు పాకింది. హాలీవుడ్లో సినిమా తీయాలంటే తనను సంప్రదించాలని, మీ సినిమాలు చాలా బాగుంటాయని హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్ వంటి వారు ప్రశంసించారు. ఆ స్థాయికి ఆయన చేరుకున్నారు. ఇక ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.
అపజయం ఎరుగని హీరోగా ఆయన పేరొందారు. రాజమౌళికి ఒక్క సినిమాకు రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ అయినా ఇచ్చేందుకు సిద్ధపడే నిర్మాతలు ఉన్నారు. ఆయన స్థాయి అలాంటిది. బాహుబలి పార్ట్-1, పార్ట్-2 సినిమాలతో దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలలో తానెంత మొనగాడో చాటి చెప్పాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్‌కి ఆయన కీర్తి పాకింది. ఇలాంటి దర్శకుడు తాను డబ్బుల్లేక భార్య సంపాదనపై బ్రతికానని చెప్పాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలోని టాప్ డైరెక్టర్లలో రాజమౌళి ఒకరు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. 1992 నుంచి డైరెక్టర్ అయ్యేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. అయితే ఆయన కల 2001 నాటికి నెరవేరింది. తనకు ఏ మాత్రం సంపాదన లేని సమయంలో రమను పెళ్లాడానని, చాలా కాలం భార్య సంపాదనపై బ్రతికానని ఆయన పేర్కొన్నాడు. అయితే ఈ విషయం చెప్పడానికి తాను ఏ మాత్రం సిగ్గు పడడని ఆయన వెల్లడించాడు.
సినిమా ఫీల్డ్ అంటే రోజంతా కష్టపడాలనే విషయం రమకు చెప్పానని, ఆమె కూడా తనను ఎంతగానో సపోర్ట్ చేస్తారని తెలిపారు. ఇక తాను వరుసగా ఫెయిల్యూర్ సినిమాలు తీసినా ఆమె తనను ప్రోత్సహిస్తారని, అవసరమైతే పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇక రాజమౌళి తన తర్వాత సినిమాను మహేష్ బాబుతో తీయనున్నారు. ఇది హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి రూ.1000 కోట్ల బడ్జెట్ ఉంటుందని ప్రచారం సాగుతోంది.