Moviesఆ తప్పే రవితేజ కొంప ముంచేసిందా..?  లేకపోతే కెరీర్ మరోలా ఉండేదా..?

ఆ తప్పే రవితేజ కొంప ముంచేసిందా..?  లేకపోతే కెరీర్ మరోలా ఉండేదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..మాస్ హీరో అనగానే అందరికి  కళ్ళ ముందు మెదలాడే పిక్చర్ మాస్ మహారాజా రవితేజ . సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరైతే .. ఆ తర్వాత అందరు చెప్పుకునే పేరు రవితేజనే .  అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత కమెడియన్గా ఇంట్రడ్యూస్  అయి .. ఆ తర్వాత హీరోగా .. ఆ తర్వాత స్టార్ హీరోగా.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తే మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ కెరియర్ లో ఎలాంటి స్థానం నుంచి ఎలాంటి స్థాయికి ఎదిగాడో మనందరికీ తెలిసిన విషయమే .

అయితే కష్టానికి మరో రూపంగా చెప్పుకునే రవితేజ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక హిట్టు కొట్టడానికి నాన్న తంటాలు పడుతున్నారు.  దానికి మెయిన్ రీజన్ రవితేజ తీసుకున్న రాంగ్ స్టెప్ అంటూ  తెలుస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న  తరుణంలో మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చేయడంతో..  ఆయన అభిమానులు ఎంతో లైక్ చేసే మాస్ సినిమాలను పక్కన పెట్టేయడం ..కాంట్రవర్షియల్ సినిమాలకు సైన్ చేయడమే ..ఆయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటున్నారు .

ఈ క్రమంలోనే రవితేజను అలాంటి పాత్రలో చూసి తట్టుకోలేక ఫాన్స్ అలాంటి సినిమాలను ఫ్లాప్ చేశారని.. ఒకవేళ నిజంగా రవితేజ మాస్ మహారాజా టైప్ లో సినిమాలు చేస్తే కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి రవితేజ నిర్ణయం ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news