Moviesఅల్లు అయాన్ కి అంత సీన్ ఉందా..? మెగా అభిమానులు ఆడేసుకుంటున్నారుగా..!!

అల్లు అయాన్ కి అంత సీన్ ఉందా..? మెగా అభిమానులు ఆడేసుకుంటున్నారుగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు బుర్రకి ఎక్కువ పనులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా వాళ్ల జీవితాలు వాళ్ళు చూసుకోకుండా.. పక్క జీవితాలపై పక్క మనుషుల లైఫ్ను నిర్ణయించే స్థాయికి మారిపోయారు . ప్రజెంట్ ఇండస్ట్రీలో మెగా వారసురాలు చరణ్ కూతురును ఏ విధంగా ట్రెండ్ చేస్తున్నారో అభిమానులు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత పుట్టిన ఈ పాపకు మహారాణిలా పట్టం కడుతున్నారు .

మెగాస్టార్ చిరంజీవి సైతం మా ఇంటి మహారాణి అంటూ ప్రకటించడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఇలాంటి క్రమంలోనే మెగా స్టార్ మనవరాలికి అల్లు అరవింద్ మనవడికి పెళ్లి చేయాలన్న సరికొత్త డిమాండ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అల్లు అర్జున్కి అయాన్ అనే కొడుకు ఉన్నాడు . ఇప్పుడు చరణ్ కి పాప పుట్టింది . దీంతో వీళ్లు బావ మరదలు అవుతారు . పెళ్లి చేస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

అయితే కొంతమంది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఉండే కోపంతో అల్లు అయాన్ కి అంత సీన్ ఉందా..? మెగా రేంజ్ ని టచ్ చేసే అంత కెపాసిటీ ఉందా ..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు ఉపాసన రాంచరణ్ ఆస్తితో పోలిస్తే అల్లు అయాన్ ఆస్తి చాలా తక్కువ అని కచ్చితంగా మెగా అల్లుడు కాకపోవచ్చు అని జోస్యం చెప్పేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరోసారి అల్లు వర్సెస్ మెగా ఫాన్స్ వార్ పిక్స్ కి చేరుకుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news