Moviesవరుణ్-లావణ్య నిశ్చితార్ధం పై నీహారిక హాట్ కామెంట్స్.. పచ్చి బూతులతో ట్రోల్...

వరుణ్-లావణ్య నిశ్చితార్ధం పై నీహారిక హాట్ కామెంట్స్.. పచ్చి బూతులతో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ లావణ్య త్రిపాఠి .. హీరో వరుణ్ తేజ్ల పేర్లే మారు మ్రోగిపోతున్నాయి . మెగా హీరోగా పేరు సంపాదించుకున్న వరుణ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠిని నిశ్చితార్థం చేసుకున్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. “మిస్టర్” అనే సినిమాలో కలిసిన టైం లోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడినట్టు ..సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి.

అప్పటినుంచి సైలెంట్ గా ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట నిన్న రాత్రి నిశ్చితార్ధంతో ఒకటయ్యారు . ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . అతి తక్కువ మంది బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య ఘనంగా వీళ్ల నిశ్చితార్ధం జరిగింది. ఈ క్రమంలోనే వీళ్ల నిశ్చితార్ధపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగ వీళ్ళ నిశ్చితార్ధంలో నీహారిక హాట్ టాపిక్ రన్ అవుతుంది .

నిహారిక నాగబాబు కూతురు . నిహారిక ఈ ఫంక్షన్ లో సింగిల్ గా కనిపించింది . గత కొన్ని రోజులుగా ఆమె విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించడంతో ఈ క్రమంలో ఈ ఫొటోస్ తో అవి కన్ఫర్మ్ అయిపోయాయి . నిహారిక జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకుంటుందని.. ఈ క్రమంలోనే ఆమె మెడలో తాళ్ళి లేదని.. అంతేకాకుండా నిహారిక సింగల్ గా ఈ ఫోటోకి ఫోజులు ఇవ్వడంతో జనాలు సైతం ఆమె డివర్స్ ని కన్ఫామ్ చేసుకున్నారు . అంతేకాదు ఈరోజు కోసం నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను అంటూ వరుణ్ – లావణ్యలకు స్పెషల్ విషెస్ అందించింది. దీంతో సోషల్ మీడియాలో నిహారిక విడాకులు వార్త వైరల్ గా మారింది. అయితే నీహారిక విడాకులు కన్ ఫామ్ కావడంతో కొందరు ఆమెను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news