Moviesరాకేష్ మాస్టర్ చనిపోతాడని రెండు నెలల ముందే తెలుసా..? బయట పడిన...

రాకేష్ మాస్టర్ చనిపోతాడని రెండు నెలల ముందే తెలుసా..? బయట పడిన టాప్ సీక్రేట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ నిన్న సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఐదు గంటలకు తుది శ్వాస విడిచారు. కాగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రాకేష్ మాస్టర్ కి మొదటి ఛాన్స్ ఇచ్చింది హీరో వేణు . ఆయన నటించిన చిరునవ్వు సినిమాలో ..నిన్నలా మొన్నలా అనే పాటకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు .

ఇక తర్వాత దాదాపు 1500 సినిమాలకు పైగానే కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన రాకేష్ మాస్టర్ .. గత కొన్ని రోజులుగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఎండలో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు . ఈ క్రమంలోనే తీవ్ర వడ దెబ్బ తగలడంతో రక్త విరోచనాలు .. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయి చనిపోయారు అంటూ డాక్టర్లు దృవీకరించారు.

అయితే ఆయన చనిపోతాడని రెండు నెలల ముందే ఆయనకు తెలుసు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. రాకేష్ మాస్టర్ మృతి పై ఆయన అసిస్టెంట్ సాజిత్ స్పందించారు . రాకేష్ మాస్టర్ బ్రతకడం కష్టమని రెండు నెలల క్రితమే డాక్టర్లు చెప్పుకొచ్చారట. ఆయనకు డయాబెటిస్ ఉండడంతో సివియర్ మెటబాలిస్ కావడంతో ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగింది అంటూ డాక్టర్లు చెప్పుకొచ్చారు . షుగర్ లెవెల్స్ తీవ్రంగా పడిపోవడం హాస్పిటల్ కి ఆలస్యంగా తీసుకురావడంతోనే ఆయన మరణించాడు అంటూ డాక్టర్లు తేల్చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news