Movies"భగవంత్ కేసరి" నుండి కాజల్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్.. రోల్ ఏంటో...

“భగవంత్ కేసరి” నుండి కాజల్ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్.. రోల్ ఏంటో తెలిస్తే మతులు పోవాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే . లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ చందమామగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటీగా మారిపోయింది. కాగా పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్.. ప్రెసెంట్ బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాను అనిల్ రావిపూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మధ్యనే బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ అభిమానుల్ని ఎంతో ఆకట్టుకునింది . కాగా నేడు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ సినిమాలో ఏ రోల్ చేస్తుందో.. అనేదాని గురించి పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్.

కాజల్ ఈ పోస్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపించింది . అంతేకాదు బాలయ్య ఏమో మాస్ లుక్ లో కనిపిస్తే కాజల్ ఏమో క్లాస్ లుక్ లో అదరగొట్టేసింది. కాగా ఈ పోస్టర్ ఆధారంగా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో సైకాలజీ లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు అర్థమవుతుంది. పక్కనంత బుక్స్ ..చేతిలో ఒక బుక్ పట్టుకొని ..చదువుతూ చాలా స్టైలిష్ గా ఉన్న కాజల్ అగర్వాల్ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైన బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాలో కాజల్ నటిస్తే అమ్మడు దశ తిరిగిపోవాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news