టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని క్రియేట్ చేసి పెట్టారు అల్లు రామలింగయ్య గారు. కాగా ఆయన తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ అల్లు అరవింద్ .. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ అల్లు అర్జున్ ..ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నారు . ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారం అయిన తెలుగు ఇండియన్ ఐడల్- 2 గ్రాండ్ ఫినాలే కోసం ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు అయ్యారు. సంగీత ప్రియులు మనసు దోచుకున్న ఈ షో కోసం ముఖ్యఅతిథిగా బన్నీ విచ్చేయడం అభిమానులకి ఫుల్ కన్నుల పండుగగా ఉండింది.
కాగా ఈ క్రమంలోనే స్టేజిపై మాట్లాడుతూ ..”తన తాత గారి గురించి ఒక జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నాడు అల్లు అర్జున్”. ఆయన మాట్లాడుతూ ..” తాత గ్రాండ్ చిల్డ్రన్లలో నేను చాలా సైలెంట్ గా ఉండేవాడిని నా తోటి మిగతా వారితో పోలిస్తే నేను చాలా మొద్దూ అనుకున్నారేమో.. ఆ రోజుల్లోనే నా పేరుతో ఒక ఇన్సూరెన్స్ కట్టించారు . నేను నామిని గా ఉండడంతో పది లక్షల రూపాయల నా చేతికి వచ్చాయి “.
“పిల్లల క్వైట్ గా ఉన్నా.. వాళ్లలో ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. అది తల్లిదండ్రులు అర్థం చేసుకొని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రయోజకులు అవుతారు” అంటూ చెప్పుకొచ్చాడు .అంతేకాదు “రామలింగయ్య గారికి 8 మంది మనమలు – మనవరాలు . వారందరిలో మొదటి సంపాదించింది నేనే ” అంటూ అల్లు అర్జున్ గర్వంగా చెప్పుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో బన్నీ కామెంట్స్ వైరల్ గా మారాయి..!!