సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న లెక్కలు మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ కి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు స్పెషల్ అనే చెప్పాలి. మరి ముఖ్యంగా అందరి డైరెక్టర్ లు ఓ విధంగా డైరెక్ట్ చేస్తే .. సుకుమార్ మరో విధంగా డైరెక్ట్ చేస్తూ ఉంటాడు . కేవలం డైరెక్షన్ పరంగానే కాదు .. ఫ్యామిలీ విషయాలలోనూ ఎప్పుడు డిఫరెంట్ గానే ఆలోచిస్తూ ఉంటారు . కొందరు డైరెక్టర్లు భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసే దానికి మొహమాట పడుతూ ఉంటారు ..సిగ్గుపడుతూ ఉంటారు .
అయితే సుకుమార్ మాత్రం ఆ విషయంలో పూర్తిగా డిఫరెంట్ భార్యతో సరదాగా గడిపిన ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు. కాగా ఈరోజు సుకుమార్ – తబితల పెళ్లిరోజు . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేసుకోచ్చింది సుకుమార్ భార్య. భర్త తో దిగ్గిన కొన్ని రొమాంటిక్ పిక్స్ ని షేర్ చేస్తూ..తన పై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చింది.
సుకుమార్ భార్య తబిత లెక్కలు మాస్టర్ కి తగ్గట్టుగానే లెక్కలు వేస్తూ తమ పెళ్లి రోజు విషెస్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగా మారింది. తబిత తన ఇంస్టాగ్రామ్ పోస్టులో..” 14 సంవత్సరాల వైవాహిక జీవితం ఈక్వల్ టూ.. 730 వారాల ఆనందం..5113 రోజుల విధేయత.. 122721 గంటల అవగాహన చేసుకునే తత్వం.. 7363288 నిమిషాల పట్టుదల.. 441797328 సెకండ్ల నిరంతర నిబద్ధత “అంటూ ఆమె చెప్పుకొచ్చారు.దీంతో సుకుమార్ తబిత జంట కలకాలం ఇలాగే అన్యోన్యంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..!!