ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పట్టిందల్లా బంగారమే అన్నట్టు శ్రీలీల ఏ సినిమాకి సైన్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ అందరూ ఆమెనే హీరోయిన్గా తమ సినిమాలో చూస్ చేసుకుంటున్నారు . ఈ కారణంగానే ఆమె చేతిలో ఏకంగా 12 సినిమాలు ఉన్నాయి అంటూ తెలుస్తుంది .
ఈ క్రమంలోనే రీసెంట్గా శ్రీ లీల మదర్స్ డే సందర్భంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిపై ఉన్న ప్రేమను బయటపెట్టింది . అంతేకాదు శ్రీ లీల ను తన తల్లి ఎలా కేర్ఫుల్ గా పెంచిందో కూడా ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే శ్రీలీల మాట్లాడుతూ ..:నాకు అమ్మానాన్న ఇద్దరు మా అమ్మే అయింది . నా చిన్నప్పటి స్కూలింగ్ అంతా చాలా బిజీబిజీగా అయిపోయింది . స్కూల్ అయిపోగానే డాన్స్, స్విమ్మింగ్ ఇలా వరుసగా బిజీ షెడ్యూల్స్ ఉండిపోయాయి”.
” మా అమ్మకి అన్ని తెలుసు. నాకు ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలో ..నన్ను ఎప్పుడు కంట్రోల్ లో పెట్టాలో బాగా తెలుసు.. అందుకే మా అమ్మ నన్ను షూటింగ్లో ఒక్క క్షణం కూడా వదలదు ..నా చిన్న తనం అంతా బిజీగానే గడిచిపోయింది.. నాకు ఆడుకునే ఛాన్స్ లేదు ..అల్లరి చేసే ఛాన్స్ మా అమ్మ నాకు ఇవ్వలేదు.. అలా కష్టపడ్డాను కాబట్టే ఇప్పుడు నా కెరియర్ ఇంత హ్యాపీగా ఉంది ..దీని అంతటికి కారణం అమ్మే “అంటూ మదర్స్ డే సందర్భంగా ఆమెపై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే శ్రీలీల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!