టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హ్యాపీ డేస్ సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తమన్న .. ఆ సినిమాలో మధు పాత్రతో చాలా మంది అభిమానులకు దగ్గరయింది . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోస్ తో జతకట్టిన తమన్నా తెలుగులో ఉండే ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోలు కుర్ర హీరోలతో జతకట్టేసింది.
బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది . ప్రజెంట్ తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది అన్న వార్త బాలీవుడ్ మీడియాని షేర్ చేస్తుంది. వీళ్ళిద్దరూ పబ్లిక్ గానే చేతులో చేయి వేసుకొని చట్టపట్టలేసుకొని తిరిగేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా తమన్న బాయ్ ఫ్రెండ్ గా పేరు సంపాదించుకున్న విజయ్ వర్మ చేసిన సిరీస్ ” దహాద్ ” కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా తోటి నటీనటులు తమన్నా తో ప్రేమాయణం పై ఓపెన్ గా విజయవర్మను లైవ్ లో అడిగేసారు.
ఈ క్రమంలోనే ఎటు ఆన్సర్ చెప్పలేని విజయ్ వర్మ జస్ట్ సింపుల్ స్మైల్ తో సిగ్గుపడుతూ అఫీషియల్‌గా తమ ప్రేమని కన్ఫామ్ చేస్తూనే స్మైల్ తో తమన్నాతో లవ్ ని నిజం చేసేసాడు. వాళ్ళ అడిగిన ప్రశ్నకి విజయవర్మ నవ్విన తీరు చూస్తే ఖచ్చితంగా ఆయన ప్రేమలో ఉన్నాడు అని చెప్పేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే అఫీషియల్ గా తమన్న పెళ్లి మ్యాటర్ బయటికి రాకపోయినా..
ఒక్క స్మైల్ తో విజయ్ వర్మ తమన్నాల మధ్య ప్రేమ ఉంది అంటూ కన్ఫామ్ చేసేసాడు ఈ బాలీవుడ్ నటుడు. ఏది ఏమైనా సరే త్వరలోనే తమన్న పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోబోతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో తమన్నాకు కొంతమంది ఫ్యాన్స్ ముందుగానే కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు..!!