బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విక్కీ కౌశల్ ..ప్రజెంట్ ఇండస్ట్రిలో ఏ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కేవలం రొమాంటిక్ సినిమాలు కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలకు సైన్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విక్కీ కౌశల్. రీసెంట్ గా ఈయన నటించిన సినిమా “జరా హట్కే జరా బచ్కే”.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విక్కీ కౌశల్ బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మరి ముఖ్యంగా తన పర్సనల్ అండ్ ప్రైవేట్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇదే క్రమంలో మీడియాతో ముచ్చటిస్తూ విక్కీ కౌశల్ తన పెళ్లి రోజుకి ముందు కత్రినాతో బాగా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు .
సరదా సరదాగా గేమ్స్ ఆడుతూ ..ఫుల్ ఎంజాయ్ చేసామని.. ఆ రాత్రి నా లైఫ్ లో మర్చిపోలేనిది అని చెప్పుకొచ్చాడు . అంతేకాదు అప్పటికే ఫుల్ తాగేసి హ్యాంగ్ ఓవర్ అయిపోయిందని ..మత్తులో ఏం చేస్తున్నానో ఎలా ప్రవర్తిస్తున్నానో కూడా తెలియలేదని చెప్పుకు వచ్చాదు విక్కీ కౌశల్ . ఇదే క్రమంలో మీడియా ఆయన ని పేశ్నిస్తూ..” కత్రినా కంటే మంచి నటి దొరికితే ఆమెకు డివర్స్ ఇస్తారా..? అంటూ ప్రశ్నించింది . ఈ క్రమంలోని మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు.. మేము లైఫ్ లాంగ్ కలిసి ఉండడానికి పెళ్లి చేసుకున్నాం ..అసలు డివర్స్ ఆలోచన మాకు లేదు అంటూ మీడియాకే తిప్పి కొట్టాడు విక్కి కౌశల్ . పేజెంట్ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!