సీనియర్ హీరో అల్లరి నరేష్ తన కెరీర్లో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే నరేష్ తొలిసారిగా పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్న తాజా సినిమా ఉగ్రం. ఈ మూవీలో మిర్నా హీరోయిన్గా నటిస్తుండగా హరీష్ పెద్ది, సాహు గారపాటి గ్రాండ్ లెవల్లో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించారు.
ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో అందరిని ఆకట్టుకున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక ఈ సమ్మర్ కానుకగా ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది. విషయం ఏమిటంటే నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న NBK 108 సినిమా నిర్మాతలే ఉగ్రం సినిమాకు కూడా నిర్మాతలు.
బాలయ్య సినిమా షూటింగ్ సెట్లోకి ఉగ్రం డైరెక్టర్ విజయ్ కనకమేడల వస్తాడు. బాలయ్య విషెస్ కావాలని అక్కడే ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడిని అడుగుతాడు. ముందు అనిల్ రావిపూడి నా బైట్ వద్దా అని ఆల్ ద బెస్ట్ చెపుతాడు. మళ్లీ విజయ్ బాలయ్య బాబు విషెస్ బైట్ కావాలంటే ఈ సారి అనిల్ శ్రీలీలతో ఆల్ ద బెస్ట్ చెప్పిస్తాడు.
చివరగా బాలయ్య బాబు గారి బైట్ అంటే ఆయన ఈ రోజు షూటింగ్‌కే రాలేదని చెప్పడంతో ఒక్కసారిగా విజయ్ బాలయ్య బాబు గారు లేరా అని అనిల్‌పై సరదాగా ఫైర్ అవుతాడు. చివర్లో అనిల్ రావిపూడి నీ సినిమా టైటిల్ ఉగ్రం నీ ఫేస్‌లో చూపించాలని చిన్న టచ్ ఇచ్చానని చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఏదేమైనా ఉగ్రం సినిమాకు ప్రమోషన్లు డిఫరెంట్‌గా నడుస్తున్నాయి. ట్రైలర్ అయితే మంచి ప్రామీసింగ్‌గా ఉంది.