మరోచరిత్ర ఇప్పటికీ.. ఎప్పటికీ ఈ సినిమా ఒక చరిత్ర అని చెప్పాలి. ఎంతమంది.. ఎంత గొప్ప నటులు ఎన్ని సినిమాలు తీసిన ఈ సినిమాకు ఉన్న ఆ చరిత్ర ఎప్పటికీ చరిత్రలో అలా నిలిచిపోయి ఉంటుంది. ఈ ఒక్క సినిమా వల్ల ఎంతోమంది ప్రేమికులు తమకు తాముగా ప్రేరణకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమిస్తే కలిసి ఉండాలి.. లేదంటే చచ్చిపోవాలి అనే ఒకే సూత్రంతో ఈ సినిమా తర్కెక్కించారు డైరెక్టర్ బాలచందర్.
1978లో విడుదలైన ఈ సినిమా కేవలం తెలుగులోనే తీశారు. తమిళ్ డైరెక్టర్ అయిన బాలచందర్ ఈ సినిమా తెలుగులో తెరకెక్కించి తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమా తెలుగులో హిట్ అయ్యాక తమిళంలో రీమేక్ చేస్తానని బాలచందర్ ప్లాన్ వేసుకున్నారు. అయితే కమలహాసన్ అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమా హీరో, హీరోయిన్లలో ఒకరు తెలుగు అయితే.. మరొకరు మద్రాసి. సినిమాలో ఎక్కువ తమిళ డైలాగులు కూడా ఉన్నాయి.
అందుకే మళ్ళీ సెపరేట్గా తమిళంలో రీమేక్ చేయటంలో అర్థం లేదని కమలహాసన్ చెప్పారు. అలా మరోచరిత్ర సినిమాను తమిళ్లో కూడా తెలుగు భాషలోనే విడుదల చేసి తమిళ్లో సబ్ టైటిల్స్ వేసి విడుదల చేస్తే అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎంత విచిత్రం అంటే మరోచరిత్ర తెలుగు వెర్షన్ మద్రాసులో ఏకంగా ఏడాది పాటు ఆడింది. అలాగే తమిళనాడులోని పలు కేంద్రాలలో వంద రోజులు.. 200 రోజులు పూర్తి చేసుకుంది.
అలా మొదటిసారి తమిళుల కోసం తెలుగు సినిమా అక్కడ రిలీజ్ చేసి సబ్ టైటిల్స్ వేస్తే అక్కడ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. అలా ఒక సినిమాను ఇండియాలో సబ్ టైటిల్స్ తో వేసి రిలీజ్ చేయటం అనేది ఇండియన్ హిస్టరీలోనే మొదటిసారిగా నిలిచింది. ఆ తర్వాత మరో చరిత్ర సినిమాను హిందీ, కన్నడ భాషలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇప్పటికీ ఈ సినిమా వస్తుంటే నేపథ్య సంగీతం వింటుంటే చాలు ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. ఈ సినిమాతోనే కమలహాసన్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే మాధవి – ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఈ సినిమా ద్వారానే హిందీ ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయం అయ్యారు. తెలుగులో మరో చరిత్ర సినిమాకు బెస్ట్ డైరెక్టర్ గా బాలచందర్ ఫిలిం పేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా.. ఎన్ని విషయాలు చెప్పుకున్నా చాలా తక్కువగానే అనిపిస్తాయి.