జయమాలిని-జ్యోతి లక్ష్మి. ఇద్దరూ కూడా అక్కాచెల్లెళ్లు. వాస్తవానికి ఇద్దరూకూడా హీరోయిన్లుగా నటించే ఉద్దేశంతోనే సినిమాల్లోకి వచ్చారు. తొలినాళ్లలోనూ..మధ్యలోనూ.. ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. తెలుగు సినిమాల కంటే కూడా తమిళ సినిమాల్లో ఇద్దరూ.. హీరోయిన్లుగా అవకాశం దక్కించుకున్నారు. అనేక సినిమాలలోనూ నటించారు. అయితే.. జయసుధ, జయప్రద, జయలలితల ధాటికి వీరునిలబడ లేక పోయారు.
పైగా.. హీరోయిన్‌తోనే క్యాబరే డ్యాన్స్ వేయిస్తే బాగుంటుందన్న తమిళ దర్శకుల ఆలోచనతో వీరు ఆ పాత్రలకు కూడా ఒప్పేసుకున్నారు. సినిమాలు బాగా ఆడాయి. ఇక, అప్పటి నుంచి ఈ పాత్రలకే వారు పరిమితం అయ్యారు. 1980లలో వీరు లేని సినిమా అంటూ లేదు. పౌరాణికం నుంచి జానపదం వరకు.. సాంఘిక సినిమాల దాకా.. దాదాపు పదేళ్ల పాటు అక్కాచెల్లెల్లు సినిమా ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేశారు.
అనేక సినిమాల్లో వేర్వేరుగా నటించారు. ప్రతి సినిమాలోనూ.. వీరు ఉండాల్సిందే. సినిమా పోస్టర్‌పై హీరోతోపాటు హీరోయిన్.. వీరు ఉండాలన్నట్టుగా సినీ రంగంలో టాక్ వచ్చేసింది.అలా జయమాలిని.. జ్యోతి లక్ష్మి ఇద్దరూ కూడా.. బాగా సంపాయించుకున్నారు. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు కూడా వచ్చాయని అంటారు.
అయితే.. వీరిలో జ్యోతిలక్ష్మి కొంత వెనుకేసుకున్నా.. జయమాలిని మాత్రం దాన ధర్మాలకు ఎక్కువగా వెచ్చించారు. చివరకు ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చిందని అంటారు. అలా జ్యోతిలక్ష్మి అన్ని విషయాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉన్నా.. జయమాలిని మాత్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడిన వైనం అప్పట్లో చాలా మందిని బాధపెట్టింది.