Moviesప్రేమ‌లో ప‌డి కెరీర్ పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే…

ప్రేమ‌లో ప‌డి కెరీర్ పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే…

సాధార‌ణంగా ప్రేమ‌లో ప‌డిన వారు.. కెరీర్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటే.. ప్రేమను కూడా నిల‌బెట్టుకుంటా రు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న‌వారే. క‌న్నాంబ‌, అంజ‌లీ దేవి, భానుమ‌తి, సావిత్రి, గీతాంజ‌లి ఇలా అనేక మంది ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే.. వీరీ సినిమాలు.. జీవితం కూడా.. పెళ్లి త‌ర్వాత‌.. ఉజ్వ‌లంగా ముందుకు సాగాయి.

ఒక్క సావిత్రి జీవితం మిన‌హా అంజ‌లీదేవి, భానుమ‌తి, క‌న్నాంబ‌, ఎస్ వ‌ర‌ల‌క్ష్మి, కేఆర్ విజ‌య (పారిశ్రామిక వేత్త ప్రేమించి చేసుకున్నారు) వంటివారు పెళ్లిళ్ల త‌ర్వాత కూడా జీవితాల‌ను జాగ్ర‌త్త‌గానే డీల్ చేశారు. ఇక‌, ఫైనాన్షియ‌ల్‌గా కూడా వారు దూకుడుగా ఉన్నారు. చిత్ర‌నిర్మాణ రంగంలోనూ అడుగులు వేశారు. ద‌ర్శ‌కులుగా కూడా రాణించారు. అయితే.. న‌వ‌త‌రం విష‌యానికి వ‌స్తే.. ఇది కొంత ఎఫెక్ట్ అయింది.

ప్రేమించి పెళ్లిళ్లు చేసుకోలేకపోగా.. జీవితాల్లో విఫ‌ల‌మై, కెరీర్‌ను కూడా నాశ‌నం చేసుకున్న హీరోయిన్లు ఉన్నారు. వీరిలో దివ్య‌భార‌తి ముందువ‌ర‌సులో ఉన్నారు. చిరు ప్రాయంలోనే హీరోయిన్‌గా మెప్పించిన దివ్య‌భార‌తి.. హిందీ సినీరంగంలో నిర్మాత‌ను ప్రేమించారు. ఆయ‌న‌కు అప్ప‌టికే పెళ్లి అయిపోయింది. కానీ, డేటింగ్ చేశారు. చివ‌ర‌కు కెరీర్ నాశ‌నం అయింది.. వ్య‌సనాల‌కు బానిస అయ్యారు. కార‌ణాలు ఏవైనా ఆమె చిన్న వ‌య‌స్సులోనే మృతిచెందారు.

ఇక‌, ఆర్తి అగ‌ర్వాల్ కూడా అంతే. తెలుగు సినిమా రంగంలో ఒక్క‌సారిగా ఎదిగిన ఆమె అనూహ్యంగా ఒక యువ హీరో ప్రేమ‌లో ప‌డ్డారు. అత‌ను కూడా ప్రేమించారు. కానీ, కుటుంబం ఒప్పుకోలేదు. దీంతో కెరీర్‌ను మ‌ధ్య‌లోనే వ‌దుల‌కుని అమెరికాకు వెళ్లిపోయి.. వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకుని.. అనారోగ్యం భారిన ప‌డి మ‌ర‌ణించారు.

ప్రేమ‌, మీనా వంటి వారి ప‌రిస్థితి కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వీరు ప్రేమించిన వారితో కొన్నాళ్లు ఉన్నా..త ర్వాత‌.. వేరేవారిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిర‌ప‌డ్డారు. కానీ, కెరీర్ ప‌రంగా చాలానే కోల్పోయార‌ని అంటారు. మీనా, ప్రేమ త‌మ ప్రేమ‌లు ఫెయిల్ అయ్యాక వేరే వాళ్ల‌ను పెళ్లి చేసుకున్నా అవి కూడా వాళ్ల‌కు క‌లిసి రాలేదు. ప్రేమ భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసింది. మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ గ‌తేడాది అనారోగ్యంతో మృతిచెందారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news