కొన్ని సినిమాలు మంచి కథ, కథన బలం ఉండి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవు. మరి కొన్ని సినిమాలు కథ, కథనాలు సరిగా లేకపోయినా ఆడేస్తుంటాయి. కొన్ని పాత చింతకాయ పచ్చడే అయినా కామెడీ వర్కవుట్ అయ్యి ఆడేస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు ఎంత బాగున్నా రాంగ్ టైమింగ్‌లో రిలీజ్ అయ్యి కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తాయి. కొన్ని సినిమాలు చిత్ర విచిత్రమైన కారణంతో ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతాయి.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు కూడా విచిత్రమైన కారణాలతో ప్లాప్ అయ్యాయి. బాలయ్య నటించిన సినిమాల్లో చాలా సినిమాలు డిఫరెంట్ కారణాలతో ప్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. కథ బాగుంటుంది.. బాలయ్య యాక్షన్ బాగుంటుంది.. డైలాగులు అదిరిపోతాయి.. టైటిల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. అయినా సినిమాల ఎగ్జిగ్యూషన్ ఎక్కడో తేడా కొట్టేసి ప్లాప్ అవుతూ ఉంటాయి.
బాలయ్య నటించిన రూలర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. జై సింహా లాంటి హిట్ సినిమా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. ఈ సినిమా ప్లాప్‌కు ప్రధాన కారణం బాలయ్య పెట్టుకున్న విగ్ సెట్ కాలేదని నిర్మాత సీ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. విగ్ బాగా సెట్ అయ్యి ఉంటే రూలర్ రిజల్ట్ ఎంత దారుణంగా అయితే ఉండేదే కాదని… బాలయ్య విగ్ మార్చేందుకు ఇష్టపడకపోవడంతో జనాలు ఆ గెటప్‌లో బాలయ్యను ఊహించుకోలేకపోయారని కళ్యాణ్ చెప్పారు.
ఇక బాలయ్య – ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్లో పవిత్రప్రేమ సినిమా వచ్చింది. ఆ తర్వాత సమరసింహారెడ్డి సూపర్ హిట్ తర్వాత మరోసారి వీరి కాంబినేషన్లో కృష్ణబాబు సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా మిక్సింగ్ టైంలో మిషన్‌లో లోపంతో అప్పట్లో ఫిల్మ్ మీద ఓ గీత పడిపోయిందట. దీంతో ఆ ప్రాబ్లమ్ ఎంత సేపు ఉందో అన్ని నిమిషాలు డీటీఎస్ తేడా వచ్చేసి… సౌండ్ అంతా రీ సౌండ్ వచ్చింది.
దీంతో అసలే సినిమా కాస్త యావరేజ్ టాక్‌తో ఉండడం.. దీనికి తోడు సౌండ్ మిక్సింగ్‌లో ఉన్న లోపంతో సినిమాకు పెద్ద దెబ్బ పడిపోయిందని ఆ సినిమా నిర్మాత ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల స్వయంగా చెప్పారు. ఆ మిక్సింగ్‌లో తేడా లేకుండా ఉండి ఉంటే కృష్ణబాబు మరిన్ని వసూళ్లు సాధించి.. మరింత మంచి టాక్ తెచ్చుకుని ఉండేదని చంటి తెలిపారు.