Movies"శాకుంతలం ఫ్లాప్ అవ్వడానికి కారణం ఆ ఒక్క సీనే".. సంచలన విషయాలను...

“శాకుంతలం ఫ్లాప్ అవ్వడానికి కారణం ఆ ఒక్క సీనే”.. సంచలన విషయాలను బయటపెట్టిన పరుచూరి..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా “శాకుంతలం”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన అన్ని భాషల్లో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొనింది. సమంత కెరియర్ లోనే పరమ చెత్త రికార్డ్ ని ఈ సినిమా నెలకొల్పింది. రీసెంట్ గా ఈ సినిమా చూసిన పరుచూరి గోపాలకృష్ణ దీనిపై రివ్యూ ఇచ్చారు .

“శాకుంతలం సినిమా కథ కంటెంట్ అన్ని బాగున్నప్పటికీ.. ఆమెను రాళ్లతో కొట్టే సన్నివేశం అభిమానులకు నచ్చలేదని .. ఆ కారణంగానే జనాలు ఈ సినిమాని ఫ్లాప్ చేశారని అభిప్రాయపడ్డారు”. అంతేకాదు ఆయన గతంలో శాకుంతలం చరిత్ర చదివాడట. కానీ ఎక్కడ కూడా శకుంతలా దేవిని రాళ్లతో కొట్టిన సందర్భాలు లేవని .. బహుశా డైరెక్టర్ గుణశేఖర్ ఆ పాత్రకు సింపతి క్రియేట్ చేయడానికి అలా రాసుకుని ఉండొచ్చని చెప్పుకొచ్చారు.

అయితే కథ కంటెంట్ బాగున్న జనాలకి మనం ఏమి అనుకున్నామో .. అర్థమయ్యేలా తెరకెక్కించడం ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఏది ఏమైన సమ్మత కెరీర్ లోనే ఈ సినిమా డిజాస్టర్ గా మిగలడం అభిమానులకు మింగుడు పడటం లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news