Moviesరాత్రికి రాత్రి రామ్ చరణ్ ప్లాన్ చేంజ్.. అఖిల్ తో కాదు.....

రాత్రికి రాత్రి రామ్ చరణ్ ప్లాన్ చేంజ్.. అఖిల్ తో కాదు.. ట్రాక్ లోకి మరోస్టార్ హీరో..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆర్ఆర్ఆర్ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్గా చరణ్ నిర్మాత విక్రం రెడ్డి కలిసి వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు .

ఈ నిర్మాణ సంస్థలో కొత్త టాలెంట్ ప్రోత్సహిస్తూ నిర్మించాలని ఇందులో భాగంగానే ఈ నిర్మాణ సంస్థలు ఫస్ట్ పిక్చర్ అఖిల్ తో తీయబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . అయితే రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఆ ఆలోచనను విరమించుకున్నారట . అఖిల్ ప్లేస్ లో కార్తికేయ 2 లాంటి బిగ్ హిట్ కొట్టిన నిఖిల్ తో ఓ సినిమాని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట . అభిషేక్ అగర్వాల్ సంస్థ కూడా జతకానుంది అంటూ తెలుస్తుంది.

దీనికి సంబంధించి అఫిషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు టీం . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అంతేకాదు అక్కినేని అఖిల్ – చరణ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్.. సడన్గా ఎందుకు అఖిల్ ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించి నిఖిల్ ని పెట్టుకోబోతున్నాడు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి రాంచరణ్ ఏం చేయబోతున్నారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news