Movies"విక్కి ఫేస్ కి కత్రీనా అస్సలు సెట్ అవ్వదు"..పచ్చటి సంసారంలో చిచ్చు...

“విక్కి ఫేస్ కి కత్రీనా అస్సలు సెట్ అవ్వదు”..పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన స్టార్ డైరెక్టర్..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ జంటగా పేరు సంపాదించుకున్న కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొంతకాలం డేటింగ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత పెద్దలను ఒప్పించి గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది . వీళ్ల పెళ్లి అయ్యి సంవత్ర్సరం దాటిపోతుంది . రేపో మాపో గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నారు . ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఈ జంటపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి .

తాజాగా విక్కి నటిస్తున్న సినిమా ” జరా హట్కే జరా బచ్కే”. ఈ సినిమాలో విక్కీ కౌశల్ కి జంటగా సారా అలీఖాన్ నటిస్తుంది . టిపికల్ మిడిల్ క్లాస్ భార్యాభర్తల మధ్య ఎంటర్టైన్మెంట్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది . ప్రస్తుతం చిత్ర యూనిట్ ఏ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడిపేస్తున్నారు . రీసెంట్గా ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన ఈ చిత్ర బృందం మీడియా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఓపిక గా సమాధానం ఇచ్చారు .

ఈ క్రమంలోనే ఓ మీడియా రిపోర్టర్ వేసిన కాంట్రవర్షల్ ప్రశ్నకు తన దైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు . సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకార్ ను ప్రశ్నిస్తూ..” ఈ సినిమాలో మీరు ఎందుకు విక్కీ కౌశల్ కి భార్యగా రియల్ వైఫ్ కత్రినా కైఫ్ ను తీసుకోలేదు ” అంటూ ప్రశ్నించారు . దీనికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు డైరెక్టర్ . ఆయన మాట్లాడుతూ..” కత్రినా కైఫ్ ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకునే ఛాన్సే లేదు . ఎందుకంటే ఆమె మొత్తం ఫారిన్ ఋఇటర్న్ అమ్మాయి ..ఎక్కడైనా మిడిల్ క్లాస్ భార్యగా కత్రినా కనిపిస్తుందా ..? మీరు చెప్పండి . కత్రినాను చూస్తే ఎవ్వరికి అలా అనిపించదు . ఆమె చాలా పార్ష్ .. అందుకే ఈ సినిమాలో విక్కీ పక్కన ఆమెను చూస్ చేసుకోలేదు . పర్సనల్గా వారిద్దరు బ్యూటిఫుల్ కపుల్. అయినా సరే ఈ సినిమాలో కథ ప్రకారం గా వాళ్ళిద్దరూ అన్ ఫిట్ . కౌశల్ పక్కన భార్యగా కత్రినా అస్సలు సెట్ అవ్వదు ‘ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు . దీనితో సోషల్ మీడియాలో ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news