News"సడెన్ గా దగ్గరకు వచ్చి అలా అడిగేసింది".. సమంత నిజస్వరూపం బయట...

“సడెన్ గా దగ్గరకు వచ్చి అలా అడిగేసింది”.. సమంత నిజస్వరూపం బయట పెట్టిన జబర్ధస్థ్ కమెడియన్..!!

జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అయిన కమెడియన్స్ ఎంతోమంది ఉన్నారు . అదే లిస్టులోకి వస్తాడు మహేష్ .. ఇలా చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేరు. అదే రంగస్థలం మహేష్ అంటే మాత్రం ట్క్కున గుర్తుపట్టేస్తారు . అంతలా ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మహేష్ . జబర్దస్త్ లో చేస్తున్నప్పుడు చిన్నచితకా స్కిట్స్ లో మెరిసి తనదైన స్టైల్ లో మెప్పించిన మహేష్ ..ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ..ఇప్పుడు తన లైఫ్ని టోటల్గా చేంజ్ చేసుకున్నాడు .

అంతే కాదు ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా రంగస్థలం అని చెప్పాలి. రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మహేశ్ ఇంపార్టెంట్ రోల్లో మెరిశారు . ఈ సినిమాలో మహేష్ కధని ఎలా మలుపు తిప్పుతాడో మనందరికీ తెలిసిందే . ప్రెసెంట్ వరస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నా మహేష్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోని షాకింగ్ విషయాలను బయటపెట్టాడు . తన పర్సనల్ అండ్ ప్రైవేట్ లైఫ్ గురించి కూడా చెప్పుకోరావడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

” తక్కువ సమయంలోనే పెద్ద స్టార్స్ తో పనిచేశానని ..ఇండస్ట్రీలో ఇంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకోవడం ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు”. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ తో తప్ప మిగతా అందరితో నటించానని చెప్పిన ఆయన త్వరలోనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు . రంగస్థలం సినిమా మీకు బ్రేక్ ఇచ్చింది కదా అన్న హోస్ట్ దగ్గర.. = సినిమాలోని కొన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

మరి ముఖ్యంగా రామ్ చరణ్ తో ఫోటో కావాలని అడిగానని.. మామూలుగా దిగితే సరిపోదు చేయి ఇలా బిగించు అప్పుడు ఇస్తా ఫోటో అని చెప్పారని మహేష్ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఏంటి కండలు పెంచుతున్నావ్ అని సరదాగా ఆటపట్టించే వారని చెప్పుకొచ్చారు, సమంత అంటే ఆయనకి చాలా చాలా ఇష్టమట . ఎంతో గౌరవం కూడా అట. ఈ క్రమంలోనే ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునే టైం లో ఆమెతో ఒక్క ఫోటో అయిన దిగాలని ఆశగా ఎదురు చూశారట . అయితే సమంతనే ఒకరోజు తన వద్దకు వచ్చి నీకేం కావాలి చెప్పు అని చాలా ప్రేమగా అడిగిందని..

ఆ టైంలో నేను ఒక బంగ్లా అడిగిన రాసి ఇచ్చేసేవారేమో అని అనుకున్నానని..అయితే నాకు ఒక ఫోటో ఇవ్వండి మేడం అంటూ ఫోటో తీసుకున్నాడట. నా ఫేవరెట్ అదే అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ . ఈ క్రమంలోనే సమంత స్టార్ హీరోయిన్ అయినప్పటికి పాపులారిటీ కాని మహేష్ దగ్గరకు వచ్చి మాట్లాడడం ఆయనకు సెల్ఫీ ఇవ్వడం నిజంగా ఆమె మంచితననానికి నిదర్శనమే చెప్పాలి. మహేష్ లైఫ్ ఇంతగా మారిపోవడానికి కారణం జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news