సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి ప్రైవసీ అనేది కరువు అయిపోతుంది . మరీ ముఖ్యంగా వాళ్లకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది. దీంతో జనాలు వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవడానికి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ సెలబ్రిటిస్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి – నాగార్జున ఫ్యామిలీల పర్సనల్ ఇష్యూస్ ఏ రేంజ్ లో ఇండస్ట్రీలో వైరల్ గా మారాయో మనకు తెలిసిందే.
నాగార్జున తన ఇద్దరు కొడుకులు పెళ్లి విషయంలో .. కెరీర్ విషయంలో ఫ్లాప్ అయ్యాడని.. అస్సలు కొడుకులు భవిష్యత్తు గురించి పట్టించుకోవడం లేదు అంటూ సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు జనాలు . అయితే సోషల్ మీడియాలో ఇంత రాద్ధాంతం జరుగుతున్న సరే నాగార్జున ఎక్కడ కూడా స్పందించకపోవడం గమనార్హం. ఇదే విధంగా మెగాస్టార్ కూడా చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా తన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు .
మొదట ఉపాసన ఆ తర్వాత ..నిహారిక ఇప్పుడు వరుణ్ తేజ్ ఇలా వరుసగా వాళ్లకు సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ ను టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్న సరే మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ కూడా నోరు విప్పడం లేదు . సైలెంట్ గానే ఉంటున్నారు . దీనికి కారణాలు ఏంటి అంటూ జనాల చర్చించుకుంటున్నారు . మరికొందరు మెగాస్టార్ నోరు విప్పకపోతే దీనికి ఫుల్ స్టాప్ పడదని.. ఇంకా దారుణంగా ట్రోల్ చేస్తారని చెప్పుకొస్తున్నారు . ఈ విధంగా గతంలో నాగార్జున సైలెంట్ గా ఉండడం ఇప్పుడు చిరంజీవి మరింత సైలెంట్ గా అయిపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఎందుకు వీళ్ళు ఈ విధంగా సైలెంట్ గా ఉన్నారు అన్నది ప్రశ్నార్ధకంగానే మారింది..?