నట శేఖర కృష్ణ-విజయనిర్మల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీరికన్నాముందే.. కృష్ణకు సంప్రదాయంగా ఇందిరాదేవితో వివాహం జరిగింది. వీరి కుమారుడే మహేష్‌బాబు. సరే.. ఇది ఇలా ఉంటే.. అసలు కృష్ణ.. విజయనిర్మలకన్నా.. ముందే అప్పటి కుటుంబ కధానాయకుడు శోభన్‌బాబు మరదలిని వివాహం చేసుకునే పరిస్థితి వచ్చిందట. చిత్రంగా ఉన్నా నిజమనే అంటున్నారు సినీ పండితులు.
హీరో కృష్ణకి చిత్ర పరిశ్రమలో మంచి స్నేహితుడు ఎవరైనా వున్నారు అంటే అది ఒక్క శోభన్ బాబు మాత్రమే. కృష్ణ, శోభన్ బాబు లు మంచి స్నేహితులే కాదు, ఇద్దరూ ఎప్పుడూ కలుసుకుంటూ ఉండేవారు కూడా. కృష్ణ ఎక్కువ శోభన్ బాబు ఇంట్లోనే ఉండేవారట. అలాగే కృష్ణ తల్లిదండ్రులు శోభన్ బాబు ని తమ పెద్దబ్బాయి గా చూసుకునేవారట. అందుకనే అతన్ని పెద్దబ్బాయి అనే పిలిచేవారు.
కృష్ణ, శోభన్‌బాబు.. ఇద్దరూ తమ కష్టసుఖాలు ఒకరికొకరు చెప్పుకొనేవారు. కలిసి అనేక సినిమాల్లో ఢీ అంటే ఢీ అన్నట్టుగా నటించి అభిమానులకు పండగ చేసేవారు. ఇక, అసలు విషయానికి వస్తే.. అప్పట్లో శోభన్ బాబు మరదలు ఒకామె శోభన్ బాబు ఇంట్లో ఉంటూ ఉండేవారు. శోభన్ బాబు కి తన మరదలని కృష్ణకి ఇచ్చి పెళ్ళిచెయ్యాలని అనుకున్నారు. కానీ కృష్ణ తల్లి గారు, నాకు వచ్చే కోడలు నా కొడుకులా తెల్లగా వుండాలని, మరేమీ అనుకోకు అని శోభన్ బాబుకి చెప్పేసిందట.
అలా నిజజీవితంలో బావాబావమరుదులు గా బంధుత్వం కలవాల్సిన కృష్ణ, శోభన్ బాబులకి ఆ సంబంధం అవలేదు. తర్వాత.. ఇందిరాదేవిని చూసి.. కృష్ణకు ఇచ్చి పెళ్లి చేశారు. ఇక, కృష్ణ పెళ్లికి శోభన్‌బాబు అన్నీ తానై వ్యవహరించారంటే.. ఆశ్చర్యం వేస్తుంది. ఇండస్ట్రీ మొత్తాన్ని 100 కార్లు పెట్టి తరలించడం నుంచి భోజనాల వరకు కూడా అన్నీ శోభన్‌బాబే చూసుకున్నారు.