నందమూరి కళ్యాణ్‌రామ్ కెరీర్ పడుతూ లేస్తూ వెళుతోంది. 2015లో పటాస్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ వరుస ప్లాపులు. మధ్యలో 118 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత అన్నీ ప్లాపులే. చివరకు గతేడాది వచ్చిన బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ యేడాది అమీగోస్ సినిమాతో మళ్లీ నిరాశ పరిచాడు.
ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ డెవిల్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అల్లరి నరేష్ ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో చెలరేగిపోయాడు అల్లరోడు. నరేష్ బాగా చేసాడు అనేవాళ్లతో పాటు నరేష్ కాకుండా మరెవరైనా అయివుంటే అని అనేవాళ్లు కూడా ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఉగ్రం కథ ముందుగా నందమూరి కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లింది.
కళ్యాణ్‌రామ్ ఇలాంటి యాంగ్రీ పోలీస్ క్యారెక్టర్లకు పెర్ ఫెక్ట్ ఫిట్ అని చెప్పాలి. పటాస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. ఉగ్రం కథ విన్నాక సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కళ్యాణ్‌రామ్ సూచించాడని…ఇక డైరెక్టర్‌కుకళ్యాణ్ రామ్ మధ్య అభిప్రాయాలు సింక్ కాకపోవడంతో చివరకు ఈ కథ అల్లరోడి దగ్గర ఆగింది.
ఒకవేళ కళ్యాణ్‌రామ్ ఈ సినిమా నిజంగా చేసి ఉంటే ఉగ్రం సినిమాకు మరింత క్రేజ్ వచ్చి వుండేది. ఈ యాంగ్రీ లుక్, మాస్ ఇమేజ్ కు కళ్యాణ్ రామ్ అయితే చాలా ప్లస్ అయి ఉండేవాడనే చెప్పాలి. అప్పుడు సినిమా రేంజ్.. వేరేగా ఉండేది. కళ్యాణ్‌రామ్ గతంలోనూ హిట్ సినిమాలు వదులుకున్నాడు. ఇప్పుడు ఉగ్రం సినిమా విషయంలోనూ మరో బ్లండర్ మిస్టేక్ చేశాడు.