News"ఏజెంట్ అట్టర్ ఫ్లాప్" .. తమ్ముడు సినిమా పై అన్న నాగచైతన్య...

“ఏజెంట్ అట్టర్ ఫ్లాప్” .. తమ్ముడు సినిమా పై అన్న నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.. ఆ కోపం ఇలా బయటపెట్టాడా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని ఇంటి పేరు ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నప్పటినుంచి ఈ ట్రోలింగ్ ఎక్కువ రేంజ్ లో కనిపిస్తుంది . రీసెంట్గా ఆ ట్రోలింగ్స్ మరింత ఎక్కువ అయ్యాయి. అఖిల్ ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకుని నటించిన ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవ్వడమే కారణం అంటూ తెలుస్తుంది . ఎప్పుడూ లేని అమలా కూడా అక్కినేని అఖిల్ పై ట్రోల్ చేస్తూ ఉండడంతో ఫస్ట్ టైం అఫీషియల్ గా స్పందించింది.

అక్కినేని ఫ్యామిలీని ట్రోల్ చేసే వాళ్ళకి ఇచ్చిపడేసింది. ఈ క్రమంలోనే నాగచైతన్య నటించిన “కస్టడి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన అటెండ్ అయిన ఇంటర్వ్యూలలో ఇదే ప్రశ్న ఎదురైంది . మనకు తెలిసిందే నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న సినిమా “కస్టడి”. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు నాగచైతన్య . ఈ క్రమంలోనే హోస్ట్ గత కొంతకాలంగా మీ కుటుంబం నుంచి వస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి . దీనిపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించాడు . ఈ క్రమంలోనే ” అభిమానులు మాపై చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం . వెలకట్టలేనిది .. అఫ్ కోర్స్ అందరూ సినిమా హిట్ అవ్వాలని తీస్తారు . ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తాం.. కానీ కొన్నిసార్లు ప్రజలు అంచనాలను అందుకోలేకపోవచ్చు.. ఏజెంట్ కూడా అలాగే ఫ్లాప్ అయింది.. ఏజెంట్ విషయంలో అదే జరిగిందని నేను అనుకుంటున్నాను.. మా కస్టడీ సినిమా చాలా బాగా అందరికీ నచ్చుతుందని ఆశపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నాగచైతన్య తమ్ముడు అఖిల్ సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ కామెంట్స్ ని కావాలనే కొందరు నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. చైతన్య కి అఖిల్ అంటే ఇష్టం లేదని..అందుకే ఇలా మాట్లాడాడని..అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news