MoviesSSMB28 Title : నషాలానికి అంటే " గుంటురు కారం".. కేకపెట్టిస్తున్న...

SSMB28 Title : నషాలానికి అంటే ” గుంటురు కారం”.. కేకపెట్టిస్తున్న మహేశ్ బాబు ఊర మాస్ లుక్(వీడియో) ..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెఎప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఎస్ఎస్ ఎం బి 28 సినిమాకి సంబంధించిన టైటిల్ రివిల్ చేశారు మేకర్స్. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా మహేష్ బాబు ఎంతటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సర్కారీ వారి పాటాలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 28 . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది. కాగా నేడు మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మోసగాళ్లకు మోసగాడు అనే రిరీలీజ్ సినిమా గ్రాండ్గా జరిగింది . ఈ క్రమంలోని మహేష్ బాబు నెక్స్ట్ సినిమాకి సంబంధించిన టైటిల్ ని రివిల్ చేశారు మేకర్స్ . అందరూ అనుకున్నట్టే సినిమాకి అదిరిపోయే మాస్ టైటిల్ ని ఫిక్స్ చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .

ఎప్పుడు తన టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే త్రివిక్రమ్ ఈసారి రూట్ మార్చాడు. కొత్త సెంటిమెంట్ ఫాలో అవుతూ సినిమాకు “హుంటూరు కారం” అంటూ ఘాటైన టైటిల్ పెట్టాడు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రముడ్ స్కోఋ అద్దిరిపోతింది. “బీడీ కూడా త్రీ డీలో కనిపిస్తుందా..?” అని మహేశ్ చెప్పిన స్లాంగ్ అభిమానులకు నచ్చేసింది. ఈ టైటిల్ తోనే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు . మరి ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబుని మనం ఎప్పుడూ చూడని కనివిని ఎరుగని మాస్ లుక్ లో చూడబోతున్నాము అంటూ సింపుల్ లైన్ లో చెప్పకనే చెప్పేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . కాగా రీసెంట్గా రిలీజ్ అయిన టైటిల్ తో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అభిమాన్య్లు. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ వైరల్ గా మారింది..!!

https://twitter.com/haarikahassine?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news