Moviesఎటువంటి కల్మషం లేకుండా చిరునవ్వు చిందిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు...

ఎటువంటి కల్మషం లేకుండా చిరునవ్వు చిందిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ఇప్పుడు మన మధ్య లేడు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్స్ అనేది చాలా ట్రెండీగా మారిపోయింది . సెలబ్రిటీస్ చిన్నప్పటి ఫొటోస్ ని ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ . ఓ స్టార్ హీరో లేదా హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ హీరో ఎవరు ..? ఈ హీరోయిన్ ఎవరు ..? గుర్తుపట్టండి అని ఎక్కువగా పోల్స్ క్రియేట్ చేస్తున్నారు. కాగా గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ స్టార్ సెలబ్రెటీస్ చిన్నప్పటి ఫోటో ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . మరీ ముఖ్యంగా ఈ ఫోటోలో ఉన్న బాబు ఎటువంటి నెగటివ్ మార్క్ లేకుండా టాప్ పొజిషన్ లోకి వెళ్లి ప్రెసెంట్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు .

దీంతో ఈ స్టార్ సెలబ్రిటీ ఎవరా..? అంటూ జనాలు బుర్ర పీక్కుంటున్నారు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నా.. రియల్ స్టార్ గా అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు. 90 శాతం సక్సెస్ రేట్ ఉన్న పర్సన్ గా సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ అందుకుని ప్రశంసలు దక్కించుకున్న ఈ హీరో పట్టుదలతో వరుస విజయాలను అందుకున్నాడు. అంతేకాదు చీమకు కూడా హాని చేయని ఈ హీరో అంటే జనాలకు ఎనలేని ఇష్టం. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

సరే నేనే చెప్పేస్తాను . ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు . దివంగత పునీత్ రాజ్ కుమార్ . అప్పుగా అశేష కన్నడ ప్రేక్షక ఆధరణ పొందిన ఈయన 46 ఏళ్ళు కే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
కన్నడ ఇండస్ట్రిలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్న పునీత్ రాజ్ కుమార్ వ్యాయామం చేస్తున్న టైంలో చెస్ట్ లో పెయిన్ రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు . ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ అప్పట్లో ప్రజలు చెప్పుకొచ్చారు. ఇప్పటికి పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేడు అన్న వార్త విని ఏడుస్తున్నారు జనాలు . పునీత్ మరణ వార్త చెప్పడానికి ఒక కన్నడ టీవీ యాంకర్ అయితే బోరు బొరున విలపించిన దృశ్యాలు ఇప్పటికి వైరల్ అవుతున్నాయి. చనిపోయి చాలా నెలలు అవుతున్న ఇప్పటికీ ఈ విషాద వార్త ఆయన అభిమానులను నిద్రపోనివ్వడం లేదు. అంత పాపులర్ హ్యూమన్ బీయింగ్ పునీత్ రాజ్ కుమార్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news