తెలుగు అబ్బాయి అయిన నవదీప్ అనూహ్యంగా వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. కెరీర్ ప్రారంభంలో మంచి సినిమాలే పడ్డాయి. ఓ వెలుగు వెలిగి అంతలోనే మసకబారిపోయాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో హీరో అయిన నవదీప్ తర్వాత రెగ్యలర్కు భిన్నమైన సినిమాలే చేశాడు. ఆ తర్వాత నవదీప్ పేరు పలు వివాదాల్లో బయట పడడంతో అతడి ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది.
ఆ తర్వాత బుల్లితెరపై నవదీప్ చేసిన రియాల్టీ షోలో అతడిలోని టాలెంట్ ఎంత దాగి ఉందో స్పష్టం చేశాయి. అయితే హీరోగా అతడిలోని టాలెంట్‌ను ఎలివేట్ చేసే మంచి క్యారెక్టర్లు పడలేదు.. అలాగే అతడు మంచి దర్శకుల చేతుల్లోనూ పడలేదు. ఇవే నవదీప్ హీరోగా టాలీవుడ్ నుంచి త్వరగా ఫేడవుట్ అయిపోవడానికి ప్రధాన కారణాలు అయ్యాయి.
తాజాగా నవదీప్ నటించిన ఓ వెబ్ సీరిస్ ఆహాలో ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నవదీప్‌కు షాకింగ్ ప్రశ్నలు మీడియా నుంచి ఎదురయ్యాయి. గతంలో మీ కారణంగా ఓ హీరోయిన్ సూసైడ్ చేసుకుందన్న ప్రశ్న నవదీప్‌కు ఎదురైంది. అయినా నవదీప్ చాలా స్టెబుల్‌గా ఆన్సర్ ఇచ్చాడు.
అలాంటి వార్తల్లో నిజం లేదని.. ఆ టైంలో తాను తన అమ్మతో కలిసి ఉన్నానని చెప్పాడు. ఇక తాను గే అంటూ జరుగుతోన్న ప్రచారం కూడా అబద్ధమే అని… నేను రేవ్ పార్టీ ఇచ్చానంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు. నేను పార్టీ ఇచ్చానన్న సమయంలో మా అమ్మతో కలిసి ఫామ్ హౌస్ లో ఉన్నా అని చెప్పాడు. ఇక తనపై వచ్చిన ఈ ఫేక్ న్యూస్‌ల కారణంగానే తనను అందరూ అనుమానించే పరిస్థితి వచ్చిందని నవదీప్ వాపోయాడు.