బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ – హీరో విక్కీ కౌశల్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు . అందరికీ తెలిసిన విషయమే . వీళ్ళు పెళ్లి చేసుకొని ఏడాది అవుతుంది . అయితే ఇంకా గుడ్ న్యూస్ చెప్పనేలేదు . అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా కత్రినా – విక్కీ కౌశల్ లో అప్పర్ హ్యాండ్ కత్రినా దే అంటూ తెలుస్తుంది.
అంతేకాదు ప్రతి విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే కత్రినాకి విక్కి కౌశల్ అంటే చాలా ఇష్టం అని కూడా పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది. రీసెంట్ గా ఈ జంట కు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్న.. ఏదైనా ఫైటింగ్ జరిగి మూడ్ ఆఫ్ అయిన .. వీళ్ళు ఆ మూడ్ ని సెట్ చేసుకోవడానికి టామ్ అండ్ జెర్రీ కామెడీ వీడియోస్ చూస్తారట .
అలా చూసినప్పుడే వాళ్ల మూడ్ మారిపోతుందట. లేకపోతే ఆ గొడవలు ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉంటారట. అంతేకాదు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఈ జంట తర్వాత ఎవరైనా అంటూ బాలీవుడ్ మీడియాలో జనాలు చెప్పుకొస్తున్నారు. దీంతో ఈ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కత్రినా – విక్కీ కౌశల్ ఫ్యాన్స్ ఈ జంటను రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!