సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వార్తలు మరింత వైరల్ అవుతూ ఉన్నాయి. ఇకపోతే కొన్నింటికి మధ్యలోనే బ్రేకప్ పడితే.. మరికొన్నింటి ప్రేమకథలు నిజమై పెళ్లి వరకు కూడా వెళ్తూ ఉంటాయి. అయితే కొంతమంది హీరోయిన్లు ఊహించని వ్యక్తులతో ప్రేమలో పడ్డప్పుడు అభిమానులు కూడా కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది.అలా లవ్ ఎఫైర్స్ తో అభిమానులకే షాక్ ఇచ్చిన హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
సబా ఆజాద్:
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రేమ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటుంది. అయితే ఆయన అసలు పాపులారిటీ లేని ఒక యువ నటితో దాదాపుగా ఐదుపదుల వయసున్న వ్యక్తిగా డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచాడు.
రష్మిక మందన్న:
రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ ల లవ్ ఎఫైర్ ఎవరు ఊహించనిది.. కానీ ప్రస్తుతం వీరిద్దరూ బాగా ట్రెండ్ అవుతున్నారు. మాల్దీవుల్లో రష్మిక, విజయ్ దేవరకొండ ఘాటు ప్రేమని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఇకపోతే తమ రిలేషన్ ని ఎంత సీక్రెట్ గా ఉంచాలని ప్రయత్నించినా సరే ఏదో ఒక విషయంలో అది బయటపడుతూ వీరు దొరికిపోతూనే ఉన్నారు.
కీర్తి సురేష్:
అసలు వివాదాలకే చోటు ఇవ్వని ఈ ముద్దుగుమ్మ కూడా వార్తల్లో నిలిచింది. ఎనర్జిటిక్ కం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో కీర్తి సురేష్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు.
తాప్సి:
అందాల తార తాప్సీ కూడా డెన్మార్క్ కు చెందిన బ్యాట్మెంటన్ ఆటగాడు మథియాస్ తో ప్రేమలో ఉంది. అయితే చాలాకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ క్లారిటీగా బయటపడడం లేదు.
తమన్నా:
గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన విజయవర్మతో డేటింగ్ చేయడం ఎవరు ఊహించలేకపోయారు. ఇక ఈమె కూడా లవ్ ఎఫైర్ తో వార్తల్లో నిలిచింది.