టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెన్నై చిన్నది సమంతకు 12 ఏళ్లకు పైగానే అనుబంధం ఉంది. నాగచైతన్య హీరోగా వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన సమంత పదేళ్ల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అందరు స్టార్ హీరోలతో నటించి ఎన్నో హిట్లు కొట్టింది. అసలు ఒకానొక టైంలో సమంత పట్టిందల్లా బంగారమే అయ్యింది.
నాగచైతన్యకు విడాకులు ఇచ్చేశాక సమంతకు కాలం కలిసి రావట్లేదు. ఏ సినిమా చేసినా సక్సెస్ ఉండడం లేదు. యశోద జస్ట్ యావరేజ్. శాకుంతలం సినిమా ఉన్న పరువు మొత్తం తీసేసింది. పుష్ప ఐటెం సాంగ్ కేవలం అక్కినేని ఫ్యామిలీ మీద రివేంజ్ తీర్చుకోవడానికి అన్న విమర్శలు మూటకట్టుకుంది. సిటాడెల్ వెబ్ సీరిస్‌లోనూ బరి తెగిస్తోందనే అంటున్నారు.
అయితే ఇప్పుడు మరికొంత కాలం ఈ సినిమా ఫీల్డ్‌లో హీరోయిన్గా కొనసాగాలన్న ఆతృతతో ఇంకా హీరోయిన్గా ఉన్నానని ఫ్రూవ్ చేసుకునేందుకు ఏ ఛాన్స్ వచ్చినా వదలట్లేదు. కుర్ర హీరోల పక్కన నటిస్తే తన క్రేజ్ తగ్గదని.. వాళ్లపైనే మోజు పడుతున్నట్టుగా ఉంది. అందుకే వరుసగా కుర్ర హీరోల సినిమాలకు ఓకే చెపుతోంది.
ఇప్పటికే విజయ్ దేవరకొండకు జోడీగా ఖుషి సినిమాలో నటిస్తోన్న సమంత.. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తోన్న సినిమాలో సిద్ధకు పక్కన రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పింది. ఇక తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ పక్కన కూడా ఓ సినిమా చేసేందుకు సై అంటోందని తెలుస్తోంది. సమంత ఎంచుకుంటోన్న హీరోలను బట్టి చూస్తే సీనియర్ హీరోల కంటే కుర్ర హీరోలు…. టైర్ 2 హీరోల కన్నా చిన్న చిన్న హీరోల మీదే కాన్సంట్రేషన్ చేస్తోంది. ఇంకా క్రేజీ హీరోయిన్గా ఉండాలన్న కోరికతోనే ఈ కుర్ర హీరోలపై ఆమె మోజు పడుతున్నట్టుగా ఉంది.