1975 నుంచి తెలుగు ఇండస్ట్రీ ఒక విధంగా దారి మళ్లిందనే చెప్పాలి. అప్పటి వరకు ఉన్న కుటుంబ కథా చిత్రాలు.. సెంటిమెంట్లు ఇలా.. అనేక విషయాల్లో మార్పులు వచ్చాయి. ఇదేసమయంలో బూతు పాటలు కూడా రంగంలోకి వచ్చాయి. ఇవి అప్పట్లో పెద్ద ట్రెండుగా నిలిచాయి. లలిత లలిత పదాలతో పాటల్లో ద్వంద్వార్థాలు జొప్పిస్తూ.. రాయించుకునేవారు. అవి మాస్ జనాలను ఎంతో ఆకట్టుకునేవి.
ముఖ్యంగాయువత అయితే.. అప్పట్లో టేపు రికార్డర్లు.. పెట్టి.. డ్యాన్సులు కూడా వేశారు. ఓ అప్పారావు.. ఓ సుబ్బారావు.. ఎవరో ఎవరో వస్తారనుకుంటే.. నువ్వొచ్చావా? అంటూ.. సాగే పాటలు.. లే..లే..లే నారాజా.. లేవనంటావా.. నన్ను లేపమంటావా? అనే పాటలు అప్పట్లో బాగా ఫేమస్. అయితే..ఈ పాటలు ప్రత్యేకంగా రాయించుకునేవారు. నిజానికి అప్పట్లో ఉన్న రచయితలు.. ఇలా రాసేందుకు ఇష్టపడేవారు.
కానీ, రామానాయుడు ఎక్కువమొత్తం రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఇలాంటి పాటలు రాయించుకునేవారు. అయినా కూడా ఆయనకు నచ్చేవి కాదు. ముఖ్యంగా ఆత్రేయ అయితే.. అసలు రాయను పో! అని ఒక్క ముక్కలో తేల్చేసేవారట. తెలుగు భాషను వేశ్యావృత్తిలోకి దింపలేను.. అని గట్టిగానే చెప్పేవారట. ఇక, ఆరుద్ర అయితే.. నావల్లకాదు.. నా కలం కలుషితం కాదు.. అదేదో సంప్రదాయంగా సీతాదేవిలా బతుకుతోంది! అని అనునయించేవారట.
ఇక, ఉన్నది వేటూరి సుందరరామమూర్తి ఒక్కరే. ఆయనేమో.. శంకరాభరణం వంటి పాటలు రాస్తున్నారు. ఇదేసమయంలో ఇలాంటి బూతు పాటలు రాయమని అడిగే ధైర్యం లేదు. ఇదే విషయం ఒక పార్టీలో చర్చకు వచ్చింది. వేటూరికి డబ్బులు కావాలి. అంతే.. అదేముంది.. నేను రాస్తాను అన్నారట. ఇక, అప్పటి నుంచి రామానాయుడుకి-వేటూరికి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. దీంతో ఆయనపై ఒక సందర్భంలో బూతు పాటల రచయిత అనే పేరు కూడా వచ్చేసింది.