Newsరాజ‌బాబుకు అప్పులు ఇచ్చిన సీనియ‌ర్ న‌టీమ‌ణి… షాకింగ్ క్లైమాక్స్‌…!

రాజ‌బాబుకు అప్పులు ఇచ్చిన సీనియ‌ర్ న‌టీమ‌ణి… షాకింగ్ క్లైమాక్స్‌…!

తెలుగు తెర‌పై ఎవ‌రు క‌నిపిస్తే.. గిలిగింత‌లు పుడ‌తాయో.. ఎవ‌రు న‌టిస్తే.. విజిల్స్ కూడా ఆగ‌కుండా మోగుతాయో.. ఆ న‌టుడే రాజ‌బాబు. ఇప్పుడు మ‌న బ్ర‌హ్మానందం టైపు. తొలినాళ్ల‌లో అస‌లు రాజ‌బాబు ఎలా సినీరంగానికి వ‌చ్చారంటే.. లైట్ బోయ్‌గా వ‌చ్చారు. అంటే.. సీన్ షూట్ చేస్తున్న స‌మ‌యంలో ఇప్పుడంటే.. టెక్నీషియ‌న్లు పెరిగారు. అధునాత‌న సాంకేతిక వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చింది. కానీ, అప్పట్లో అంతా మాన్యువ‌ల్‌గానే జ‌రిగేది. దీంతో అప్ప‌ట్లో లైట్ మ్యాన్ల‌కు డిమాండ్లు ఉండేవి

సుదీర్ఘ స‌మ‌యంలో ఆ ప్ల‌డ్ లైట్‌ల‌ను అలా ప‌ట్టుకుని ఉండాలి. అవి చాలా బ‌రువుగా కూడా ఉండేవి. దీంతో ఒక‌రోజు వ‌చ్చిన వారు రెండో రోజుకు క‌నిపించేవారు. దీంతో లైట్ బ్యాయ్/ మెన్‌ల‌కు మంచి డిమాండ్‌. ఇలా చాలా మంది లైట్లు మోసేవారికి ఎంట్రీ ఇచ్చి.. త‌ర్వాత‌.. హీరోలు అయిన వారు కూడా ఉన్నారు. ఇలాంటివారిలో రాజ‌బాబు ఒక‌రు. పెద్ద‌గా చ‌దువు అబ్బ‌లేదు.

దీంతో ఏదో ఒక ప‌నికోసం మ‌ద్రాస్‌కు వెళ్లాల‌ని ఇంట్లో చెబితే.. ఆయ‌న అలానే వ‌చ్చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఫుట్ పాత్‌పై ప‌డుకుంటే.. అదృష్టం త‌న్నుకొచ్చింది. లైట్ మ‌న్‌గా ఆయ‌న ఎంట్రీఇచ్చారు.
రోజుకు .. అప్ప‌ట్లో ఆయ‌న‌కు ఇచ్చిన వేత‌నం.. అక్ష‌రాలా 20 పైస‌లు. దీంతో రెండు ఫుల్ మీల్స్ వ‌చ్చేవి. అలా ఎంట్రీ ఇచ్చిన రాజ‌బాబు అన‌తి కాలంలోనే చిన్న పాత్ర‌కు ఎంపిక అయ్యారు.

అదే ఆయ‌న జీవితాన్ని మ‌లుపు తిప్పింది. ఇక‌, త‌ర్వాత త‌ర్వాత‌.. వ్య‌స‌నాల‌కు బానిస‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనేక మంది ముందు చేయి చాపార‌ని ఒక చ‌ర్చ న‌డిచేది. ఇలా.. మ‌హాన‌టి సూర్యాకాంతం నుంచి ఆయ‌న అప్పులు చేశార‌ని అంటారు. దాదాపు 5 వేల‌రూపాయ‌ల వ‌ర‌కు ఆమె నుంచి ఆయ‌న తీసుకున్నార‌ని అంటారు. అయితే.. ఏనాడూ.. ఆమె అడిగింది లేదు. ఈయ‌న ఇచ్చింది లేదు. అయితే.. చివ‌రి ద‌శలో(మ‌రో వారంలో కాలం చేస్తార‌న‌గా) అమ్మ‌ను చూడాల‌ని ఉంద‌ని క‌బ‌రు పంపితే.. సూర్యాకాంతం వ‌చ్చి చూసి వెళ్లార‌ట‌. ఇదీ.. జ‌రిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news