తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప విషయమైనా ఆ రోజుల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోగా మారి ఆ తర్వాత తన పేరుని మెగాస్టార్ స్థాయికి ఎదిగేలా చేసుకున్నాడు. సినిమాల పరంగా ఎంత సక్సెస్ అయ్యాడో కుటుంబం పరంగా కూడా అంతే సక్సెస్ అయ్యాడు చిరంజీవి.
కాగా ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఒకవేళ సురేఖను పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్టార్ హీరోయిన్ ని తన భార్యగా స్వీకరించేవాడు అంటూ అప్పట్లో న్యూస్ వైరల్ అయింది . ఆమె మరెవరో కాదు అలనాటి నటి మాధవి . తెరపై చిరంజీవి మాధవి కాంబో ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళ జంటను చూసి నిజంగానే భార్య భర్తలు లా ఉన్నారు అంటూ అప్పట్లో జనాలు చర్చించుకునే వాళ్ళు ..
అలాంటి పర్ఫెక్ట్ కెమిస్ట్రీల వీళ్ల మధ్య ఉంది . అయితే చిరంజీవి సైతం నిజంగానే మాధవి నటనకు మాధవి డాన్స్ కు ఫిదా అయిపోయాడట . ఆమెని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడట. అయితే అల్లు రామలింగయ్య గారు సురేఖను చూపించిన క్షణంలో మాధవిని మరిచిపోయి సురేఖకు కమిట్ అయ్యాడట చిరంజీవి . అప్పట్లో ఈ వార్త పెద్ద హార్ట్ టాపిక్ గా టర్న్ అయింది.
అయితే చిరంజీవి ఇప్పటివరకు ఈ వార్తపై స్పందించకపోవడం గమనార్హం. కాగా పెళ్లి తర్వాత చిరంజీవి సురేఖకు ఎలాంటి వాల్యూ ఇస్తూ ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటున్నాడో మనకు తెలిసిందే. ఇప్పటికి మెగాస్టార్ గా తనకొచ్చిన పూర్తి సక్సెస్ ని సురేఖకు ఇచ్చేశాడు అంటే నిజంగా అది చిరంజీవిలో ఉన్న ఓ గొప్ప గుణం అని చెప్పాలి..!!