తెలుగు టెలివిజన్ బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్న అందరికీ ఇష్టమైన యాంకర్ ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు యాంకర్ సుమ . ఇండస్ట్రీ లోకి వచ్చి దశాబ్దాలు దాటుతున్న సరే.. ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్ గా పేరు సంపాదించుకుని స్టార్ హీరోయిన్స్ కి మించిన క్రేజ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది . ఇలా ఏ మాత్రం క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీగా తన షెడ్యూల్ ముందుకు తీసుకెళుతున్న సుమకి సంబంధించిన రీసెంట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
మనకు తెలిసిందే సుమ ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ లో షోలు చేస్తూ అందరి హీరోస్ కి సంబంధించిన ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ యూట్యూబ్ లో కూడా తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంటుంది . ఈ లెక్కన చూసుకుంటే చాలా డబ్బులు ఇన్కమ్ గా వచ్చి చేరుతుంది. అయితే సుమ ఎక్కడ కూడా ఎవ్వరికి హెల్ప్ చేసిన ధాఖలాలు లేవు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు హీరోయిన్స్ సర్టైన్ టైంలో ఫండ్స్ ఇస్తూ కనిపించారు. కానీ సుమ మాత్రం ఎక్కడా కూడా ఫంద్స్ ఇచ్చిన దాఖలాలు లేవు.
అంతేకాదు సుమకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. స్టేజిపై చలాకిగా గుక్క తిప్పుకోకుండా మాట్లాడే సుమా రెమ్యూనరేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట. ఎంతలా అంటే ఈవెంట్ కి కమిట్ అయ్యే ముందు హాఫ్ రెమ్యూనరేషన్ ఈవెంట్ అయిపోయిన వెంటనే హాఫ్ ఇవ్వాల్సిందే అట . అది ఎంత అర్ధరాత్రి అయినా పర్లేదు . ఆమె చేతుల్లో పడాల్సిందే . అంత పక్కాగా ఉంటుందట . యాంకరింగ్ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తుందో డబ్బులు విషయం లో కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది సుమ అంటూ జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు . మరి కొంతమంది నిజమే కదా కష్టపడి సంపాదించిన డబ్బు ఆ మాత్రం తీసుకోకపోతే ఎలా ..తను ప్రతిక్షణం పిల్లలను వదిలి అంత కష్టపడినప్పుడు ఆ డబ్బుకు వేల్యూ ఉంది కదా ..? అంటూ సుమ ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే పైకి చాలా అల్లరిగా కనిపించే సుమ డబ్బు విషయంలో ఇంత స్ట్రిక్ట్ గా పిసినారిగా ఉంటుందా ..?అంటూ జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.