Moviesచేతుల్లారా బంగారం లాంటి "ఆర్య" సినిమాను మిస్ చేసుకున్న ఆ...

చేతుల్లారా బంగారం లాంటి “ఆర్య” సినిమాను మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి హీరో ఇతనే.. ఎంత దరిద్రం అంటే..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అందరికి టక్కున గుర్తువచ్చేది ” ఆర్య “. మల్టీ టాలెంటెడ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది . 7 మే 7 న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసింది . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ తన స్థాయిని పెంచుకోవడానికి ఈ సినిమా ఎంతో సహాయపడిననే చెప్పాలి .

ఈ సినిమా ద్వారా సుకుమార్ ఎంత పాపులారిటి సంపాదించుకున్నాడు అంతకు డబల్ రేంజ్ లో అల్లు అర్జున్ తన క్రేజ్ పాపులారిటి పెంచేసుకున్నాడు . అయితే ఇంతటి మంచి సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో గురించి ఇప్పుడు విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి . లవ్ స్టోరీ కి కొత్త అర్థం తెలియజేసేలా చేసిన ఈ సినిమా కథను ముందు టాలీవుడ్ కమెడియన్ హీరో అల్లరి నరేష్ కి సుకుమార్ చెప్పారట. అయితే అల్లరి నరేష్ ఈ కథను రిజెక్ట్ చేశారట.

“లవ్ స్టోరీ” కావడంతో జనాలు అతని యాక్సెప్ట్ చేయారని తెలుసుకున్న అల్లరి నరేష్ .. ఈ పాత్రకి నేను సెట్ అవ్వనండి..కానీ నాకు కథ నచ్చింది అంటూ చెప్పుకొచ్చారట. అయితే ఆ తర్వాత వెంటనే పలువురు హీరోలను అప్రోచ్ అయిన సుకుమార్ అప్పుడప్పుడే ఫేమస్ అవుతున్న అల్లు అర్జున్ ని కథలో ఊహించుకొని అతగాడికి వివరించారు . అల్లు అరవింద్ – అల్లు అర్జున్ కధ నచ్చడంతో వెంట వెంటనే సినిమాకి సైన్ చేయడం తెరకెక్కించడం రిలీజ్ చేయడం బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగిపోయింది . ఇలా చేతులారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నాడు అల్లరి నరేష్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news