నాగచైతన్యకు విడాకులు ఇచ్చేశాక సమంత మరీ బరి తెగించేసింది. విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అంటూ ఐటెం సాంగ్‌లో దారుణంగా రెచ్చిపోయింది. ఆ తర్వాత సిటాడెల్ వెబ్‌సీరిస్‌లో ఎంతలా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయిందో చూశాం. అసలు ఈ వెబ్‌సీరిస్ వల్లే వీరు విడాకులు తీసుకున్నారన్న ప్రచారమూ జరిగింది.
అయితే ఇప్పుడు సడెన్‌గా అవతారం మార్చేసింది. యశోద లాంటి థ్రిల్లర్, శాకుంతలం లాంటి పౌరాణిక పాత్రలతో పాటు ఇప్పుడు చాలా రోజుల తర్వాత ప్రేమకథలో నటిస్తోంది. అదే ఖుషి సినిమా. కుర్ర హీరో విజయ్ దేవరకొండకు జోడీగా ఆమె ఖుషి సినిమాలో నటిస్తోంది. అసలు ఇప్పటికే అన్ని విప్పి చూపించేసిన సమంత ఇప్పుడున్న పరిస్థితుల్లో లవ్ స్టోరీలో మెప్పిస్తుందా? లేదా? అనేది చాలామందిలో సందేహాలు ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే ఖుషి సినిమా స్టిల్స్, పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలో విజయ్‌కు ఆమె జోడీగా కాకుండా.. అక్కలా ఉందన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఏం మాయ చేశావే సినిమాలోని జెస్సీ పాత్రను చూస్తే ఆమె నిజమైన ప్రేమికురాలిలా ఉంటుంది. అదే ఇప్పుడు ఆమె ప్రేమకథల్లో నటిస్తే చూసేందుకే ఎబ్బెట్టుగా ఉంటుందని.. అందులోనూ విజయ్ లాంటి క్యూట్, యంగ్ హీరో పక్కన ఆమెను అస్సలు ఊహించుకోలేమని అంటున్నారు.
పైగా సమంత ఇప్పుడు ఆంటీ స్టేజ్‌లో ఉంది. యాక్షన్ సినిమాల్లోనూ చేసింది. ఇక లేడీ ఓరియెంటెడ్ పాత్రల వైపు కాన్సంట్రేషన్ చేస్తోంది. ఈ టైంలో ఆమె లవ్‌స్టోరీకి ఒప్పుకోవడం.. అసలు ఆమెను ప్రేమకథలో నటింపజేయాలనుకోవడం.. అందులోనూ విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోకు జోడీగా పెట్టడం ఏ మాత్రం సూట్ కాలేదన్న చర్చలే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇటీవల ఖుషి నుంచి రిలీజ్ అయిన సాంగ్ పై కూడా నెగటివ్ కామెంట్లు పడుతున్నాయి. ఏదేమైనా ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండతో సమంత అదిరిపోయే కెమిస్ట్రీ పండిస్తే తప్పా లేకపోతే సమంత ఫేడవుట్ హీరోయిన్ అన్న విమర్శలు మరింత ఎక్కువ అవుతాయి.