పాపం .. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ,.ఒకటి తలిస్తే మరొకటి అవుతుంది. భారీ అంచనాల నడుమ తెరకేక్కి రిలీజ్ అయిన శాకుంతలం సినిమా ఎంత డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతకుముందు పాన్ ఇండియా లెవెల్ లో నటించి రిలీజ్ అయిన యశోద సినిమాకి వచ్చిన క్రేజ్ మొత్తం ఈ సినిమాతో ఊడ్చుకుపోయింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరింత రేంజ్ లో సమంత పేరును ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అలాంటి విషయాలను ఏమాత్రం పట్టించుకోని సమంత రీసెంట్గా తన ఇంస్టా స్టోరీలో ఒక కొటేషన్ షేర్ చేసింది .
ఆ కొటేషన్ కి సంబంధించిన న్యూస్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఆ కొటేషన్ లో షేర్ చేసిన కంటెంట్ ఎలా ఉన్నా కానీ.. ఆ కంటెంట్ రాసిన వ్యక్తిని పేరు మాత్రం మార్గస్ కాదు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . అంతేకాదు ఫ్యాక్ట్ చెక్కర్లు కూడా ఇదే విషయాన్ని తేల్చేశారు . అసలు మేటర్ ఏంటంటే మార్కస్ అలియాస్ అనే రోమన్ చక్రవర్తి ఆ కొటేషన్ రాసినట్లు సమంత చెప్పుకొచ్చింది . సమంత షేర్ చేసిన ఆ కొటేషన్ లో ఏముంది అంటే ..”మనం వినే ప్రతిదీ నిజం కాదు .అది ఒక అభిప్రాయం మాత్రమే ..అలాగని మనం చూసే ప్రతి విషయం నిజం కాదు ..కేవలం అది దృష్టి కోణం మాత్రమే” అంటూ రాసుకొచ్చింది.
అఫ్కోర్స్ కంటెంట్ లో ఉన్న విషయం మాత్రం నిజమే.. సమంత చెప్పింది అక్షరాల కరెక్ట్. అయితే కంటెంట్ రాసిన కొటేషన్ రాసిన వ్యక్తి రోమన్ చక్రవర్తి అని చెప్పుకురావడం తప్పు అంటున్నారు ఫ్యాక్ట్ చెక్కర్లు. ఆ కంటెంట్ రాసింది ఎవరో తెలియకుండానే షేర్ చేసావా ..? అంటూ మండిపడుతున్నారు ట్రోలర్స్. ఫ్యాక్ట్ చెక్కర్లు కూడా అది రాసింది రోమన్ చక్రవర్తి కాదు అంటూ చెప్పుకోరావడంతో ఈ తలనొప్పులు భరించలేక సమంత ఏకంగా ఆ పోస్ట్ డిలీట్ చేసేసింది . దీంతో సమంత పేరుని మరోసారి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు.