Moviesవేణు హీరోయిన్ అభిరామి గుర్తుందా… పెళ్లై 14 ఏళ్లు అవుతున్నా పిల్ల‌లు...

వేణు హీరోయిన్ అభిరామి గుర్తుందా… పెళ్లై 14 ఏళ్లు అవుతున్నా పిల్ల‌లు లేక ఏం చేసిందంటే…!

మ‌ళ‌యాళ న‌టి అభిరామి అంటే ఇప్ప‌టి త‌రం సినీ ప్రేమికుల‌కు తెలియ‌దు ఏమోగాని.. తెలుగులో 20 ఏళ్ల క్రితం కొన్ని సినిమాల్లో న‌టించింది. అప్ప‌ట్లో ఆమె ఓ పాపుల‌ర్ హీరోయినే. వేణు హీరోగా వ‌చ్చిన చెప్ప‌వే చిరుగాలి సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టించింది. ఆ త‌ర్వాత ఆమె అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ, ఛార్మినార్‌, థ్యాంక్యూ సుబ్బారావు వంటి ప‌లు సినిమాల్లో న‌టించింది.

తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లోనూ కొన్ని సినిమాల్లో న‌టించింది. పెళ్ల‌య్యాక కూడా ఆమె సినిమాల్లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం మ‌ళ‌యాళ స్టార్ న‌టుడు సురేష్‌గోపీ హీరోగా న‌టిస్తోన్న గ‌రుడ‌న్ సినిమాలోనూ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. అభిరామి ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌వ‌న‌న్ మ‌నువ‌డు రాహుల్ ప‌వ‌న‌న్‌ను 2009లో పెళ్లాడింది.

అయితే పెళ్ల‌య్యి 14 ఏళ్లు అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దంప‌తుల‌కు పిల్ల‌లు లేరు. అయితే ఈ దంప‌తుల‌కు పిల్ల‌లు లేక‌పోవ‌డంతో వీరు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఓ బిడ్డ‌ను పెంచుకునేందుకు ద‌త్త‌త తీసుకున్నారు. ఒక త‌ల్లిగా మ‌ద‌ర్స్ డే సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని.. ఈ మేర‌కు త‌న కూతురుతో క‌లిసి దిగిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసుకుంది.

అభిరామి తీసుకున్న నిర్ణ‌యంపై ప‌లువురు ఆమెకు విషెస్ చెపుతున్నారు. అభిరామి షేర్ చేసిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ దంప‌తులు పాప‌ను ద‌త్త‌త తీసుకుని యేడాదికి పైనే అవుతోంద‌ట‌. ఆ పాప‌ను యేడాది కాలం నుంచి వీరు పెంచుతున్నారు. ఇక త‌మ కుమార్తెకు క‌ల్కి అనే నామ‌క‌ర‌ణం చేసిన‌ట్టు కూడా అభిరామి తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news