అన్నగారు ఎన్టీఆర్ విశ్వరూపం చూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, కథా పరంగా.. సంగీతం.. సాహిత్యం పరంగానే కాకుండా.. నటీనటుల పరంగా కూడా.. పేరెన్నికగన్న చిత్రం నర్తనశాల. ఈ సినిమా కన్నడ, తమిళ భాషల్లోనూ రీమేక్ అయింది. అంతేకాదు.. ఈ సినిమాకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. అయితే.. ఈ సినిమా ప్రారంభంలో పెద్ద రగడే జరిగింది. అది కూడా రెండు విషయాల్లో అన్నగారు దర్శకుడితో వివాదానికి దిగారు. పైగా ఆయన కమలాకామేశ్వరరావు కావడం మరో చిత్రం.
ఇంతకీ వివాదం ఏంటంటే.. నర్తన శాలలో అన్నగారికి అర్జనుడి వేషం ఇచ్చారు. అయితే.. సినిమా అంతా కూడా.. భీముడి చుట్టూ తిరుగుతుంది. కీచక వధ.. ద్రౌపదీ దేవిని కీచకుడు వేధించడం.. ఇలా.. కథ అంతా కూడా.. ద్రౌపది-కీచకుడు-భీమసేనుడి చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఆ పాత్ర తానే చేస్తానని అన్నగారి పట్టుబట్టారు.కానీ, ఆ పాత్రకు అప్పటికే కేరళకు చెందిన వ్యక్తిని ఓకేచేశారు.
పైగా.. అర్జనుడు. భీమసేనుడు ఒక్కరే చేస్తే.. కథలో బలం తగ్గుతుందని.. దర్శకుడి వాదన. దీంతో అర్జనుడి పాత్రను హైలెట్ చేస్తామని ఒప్పుకొని కథలో చిన్నచిన్నమార్పులు చేసి.. పాటలు కూడా పెట్టారు. అంతేకాదు.. బాలమురళీ కృష్ణతో అన్నగారికి వాయిస్ ఇప్పించారు. ఇక, మరో వివాదం.. మరింత చమత్కారం. ఈ సినిమాలో.. ద్రౌపదీ దేవి పాత్రకు సావిత్రిని తీసుకున్నారు. ఆమెనే దృష్టిలో పెట్టుకుని కథను కూడా రాసుకున్నారు.
ఇది పౌరాణికమే అయినా.. సావిత్రి అభినయానికి, వాయిస్‌కు పెద్ద పీట వేసిన సినిమా. అయితే..అన్నగారు.. సావిత్రి వద్దు.. సరోజ కానీ, అంజలికానీ.. పెట్టాలి.. అని కబురు పెట్టారు. అప్పటికే మాటలు కూడా రెడీ అయిపోవడం.. అడ్వాన్స్ ఇచ్చేయడం.. కాల్షీట్లు కూడా ఖరారవడంతో కుదరన్నారు. చివరకు సావిత్రితో ఫోన్ చేయించి.. మరీ ఒప్పించాల్సి వచ్చింది. అయితే.. సావిత్రిని ఎందుకు వద్దన్నారో.. మాత్రం ఇప్పటికీ సస్పెన్సే..!