సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఫిదా సినిమా తోనే అందరి మనసులని ఫిదా చేసేసిన ఈ మలయాళీ బ్యూటీ మలర్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది . పెద్ద డాక్టర్ చదువులు చదివిన సాయి పల్లవి ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అంతేకాదు అప్పటివరకు కేవలం గ్లామరస్ పాత్రలకి మాత్రమే పరిమితమైన హీరోయిన్స్ ని కంటెంట్ పరంగా కూడా ముందుకు తీసుకొచ్చేందుకు బిగ్ స్టెప్ తీసుకుంది సాయి పల్లవి అని చెప్పడంలో సందేహం లేదు .
సాయి పల్లవి ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ లు హీరోయిన్స్ కి కథలో కంటెంట్ రాయడం అలవాటు చేసుకున్నారు . కాగా తన సినిమాల విషయంలో క్రేజీ క్రేజీ కండిషన్స్ పెట్టే సాయి పల్లవి .. రొమాంటిక్ సీన్స్ లో నటించదు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే అలాంటి సాయి పల్లవి ని కూడా తెలుగు హీరో ఫిదా చేసేసాడు . ఆయన మరెవరో కాదు శర్వానంద్ .
శర్వానంద్ అంటే సాయి పల్లవికి చాలా చాలా ఇష్టమట. వీళ్ళిద్దరి కాంబోలో పడి పడి లేచే మనసు సినిమా వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయిన ఇద్దరికీ మంచి మెమోరీస్ ని మిగిల్చింది . ఈ సినిమా టైంలో సాయి పల్లవి శర్వానంద్ ని గాఢంగా ప్రేమించిందని .. మరికొన్ని రోజుల్లోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే అదంతా కేవలం వాళ్ళ పుకార్లే అంటూ ఫాన్స్ క్లారిటీ ఇచ్చేశారు .
ఇండస్ట్రీలో ఉండే హీరోలని పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . అయితే సాయి పల్లవి అంటే ఇష్టం ఉన్న ఓ బడా ప్రొడ్యూసర్ కొడుకు ఆమెకు పెళ్లి ప్రపోజల్ పెట్టగా ఇదే చిన్న రీజన్ తో ఆమె పెళ్లిని సైతం క్యాన్సిల్ చేసుకుందట. ఏది ఏమైనా సరే సాయి పల్లవి చాలా మొండిది అనుకున్నది అనుకున్నట్లు చేస్తుంది . అనుకున్నది సాధించే వరకు నిద్రపోదు . చూడాలి మరి ఇలాంటి సాయి పల్లవిని పెళ్లి చేసుకునే మగాడు ఎక్కడున్నాడో.. ప్రజెంట్ సాయి పల్లవి తనదైన స్టైల్ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది..!!