అన్నగారు ఎన్టీఆర్ అనేకసినిమాల్లో నటించారు. ఆయనకు ఎప్పుడూ డబ్బింగుతో అవసరం లేకుండా పోయింది. అదేవిధంగా అక్కినేని నాగేశ్వరరావు విషయం కూడా. అయితే.. పరభాషా నటుల ప్రవేశం 1980ల నుంచి ఎక్కువగా తెలుగు సినిమా రంగంపై ప్రభావం చూపింది. రజనీకాంత్ నుంచిఅనేక మంది తమిళన టులు.. కన్నడ నటులు కూడా తెలుగు సినిమాలపై తమ ముద్ర వేశారు.
ఈ క్రమంలో నటనపరంగా ఓకే అయినా.. వారికి భాషా పరమైన సమస్యలు వచ్చాయి. దీంతో డబ్బింగు ఆర్టిస్టులకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో వివిధ ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న వారికి అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో వారికి సినిమా షెడ్యూల్‌కు సమయం సరిపోయేది కాదు. దీంతో కొత్తగా దాసరి నారాయణరావు.. డబ్బింగు ఆర్టిస్టులు కావాలంటూ..పత్రికా ప్రకటన ఇచ్చారు. అయితే, అప్పటికే ఎన్టీఆర్‌కు ఆయనకు మద్య విభేదాలు వచ్చాయి.
దీంతో ఎన్టీఆర్ ఏం .. మన దగ్గర ఆర్టిస్టులు సరిపోరా..?
అంటూ.. ప్రకటన చేశారు. ఇది వివాదానికి దారి తీసింది. దాసరి నారాయణరావు ఏకంగా.. 100 మంది డబ్బింగు ఆర్టిస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కొన్నాళ్లకు 40 మంది నిలదొక్కుకున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి పనిలేకపోతే.. దాసరి నారాయణ రావు స్వయంగా వారికి వేతనాలు ఇచ్చి.. పనిలేకపోయినా.. ఆదుకున్నారు. ఆతర్వాత.. వారికి మాలో సభ్యత్వం ఇవ్వాలని పట్టుబట్టారు.
అన్నగారు ఒప్పుకోలేదు. తెలుగు నేటివిటీని దెబ్బతీస్తున్నారంటూ.. పెద్ద వివాదానికి దారితీశారు. ఆ సమయంలో ఏదో ఒకటి చేయాలని అక్కినేనికి కబురు పెట్టారు అన్నగారు. కానీ, అక్కినేని వివాదాలకు దూరంగా ఉంటానంటూ.. ఏమీ తేల్చలేదు. దీంతో ఆర్టిస్టుల ఒత్తిడితో దాసరి నారాయణరావు స్వయంగా అన్నగారిని కలిసి.. అంతా మనవాళ్లే.. మన వాళ్లను మనం వదులుకుంటామా ? అని నచ్చజెప్పి.. అన్నగారిని ఒప్పించారు. తర్వాత వివాదం సర్దు మణిగింది.