ఏంటో ..ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక సెలబ్రిటీ మరణించారు అన్న విషాద చాయలు నుంచి కోలుకోక ముందే మరొక సెలబ్రిటీ మరణించారు అన్న న్యూస్లు వినిపిస్తూ ఉండడంతో సినీ లవర్స్ మొత్తం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోతున్నారు . ఢీ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న చైతన్య మాస్టర్ మరణించిన విషయం తెలిసిందే.
అంతేకాదు నిన్ను తెల్లవారుజామున ఇళయరాజా అన్న కొడుకు కూడా గుండెపోటు కారణంగా మరణించారు . ఇలా వరుసగా విషాద వార్తలు వింటున్న తరుణంలోనే మరో బ్యాడ్ న్యూస్ అభిమానులకు వినిపించింది . కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో విక్రమ్ ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్ స్టార్ గా పేరు సంపాదించుకున్న విక్రమ్ ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో ” తంగళన్ ” అనే సినిమా చేస్తున్నాడు.
కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విక్రమ్ కు గాయాలు అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన పక్కటెముకలు విరిగాయని ప్రస్తుతం హాస్పిటల్ లో అత్యవసర చికిత్సవ విభాగంలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు విక్రమ్ కొన్ని రోజులపాటు టోటల్ బెడ్ రెస్ట్ తీసుకుని తీసుకోవాలి అంటూ డాక్టర్ లు చెప్పకు వచ్చారట . . ఈ సినిమా షూట్ టైంలోనే విక్రమ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది . తంగళన్ కోసం రిహార్సల్ చేస్తున్నప్పుడు పక్కటెముక విరిగిందని తెలుస్తోంది. ఆయనకు చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. దీని పట్ల ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!!