Moviesబాల‌య్య 108లో డ్రైవ‌ర్ కాదు… ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్..!

బాల‌య్య 108లో డ్రైవ‌ర్ కాదు… ఫ్యీజులు ఎగిరిపోయే అప్‌డేట్..!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో బాల‌య్య కెరీర్‌లోనే 108వ సినిమాగా వ‌స్తోన్న క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. బాల‌య్య ఇప్ప‌టికే అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో అనిల్ రావిపూడి సినిమాతో ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొడ‌తాడ‌న్న కాన్ఫిడెంట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బ‌లంగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా ఎంపికైంది.

అలాగే మ‌రో యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇక థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాల‌య్య జైలు జీవితం గ‌డుపుతాడ‌ని.. చాలా యేళ్ల పాటు జైలులో ఉండి బ‌య‌ట‌కు వ‌చ్చాక డ్రైవ‌ర్‌గా చేస్తాడ‌ని నిన్న‌టి వ‌ర‌కు రూమ‌ర్లు వ‌చ్చాయి.

అయితే బాల‌య్య డ్రైవ‌ర్‌గా న‌టించ‌డ‌ని.. సినిమా ఫ‌స్టాఫ్‌లో అంతా ఖైదీగానే ఉంటాడ‌ట‌. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లోనే బాల‌య్య జైలు నుంచి రిలీజ్ అవుతాడ‌ట‌. అక్క‌డ అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంద‌ని చెపుతున్నారు. సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఓ భారీ యాక్ష‌న్ మూవీగా రాబోతోంద‌ని.. బాల‌య్య సినిమా అంతా పూర్తిగా తెలంగాణ మాండ‌లికంలోనే డైలాగులు చెపుతాడ‌ని అంటున్నారు.

ఇక బాల‌య్య 60 ఏళ్ల గెట‌ప్ కూడా సినిమాకే హైలెట్ అంటున్నారు. క‌థ విష‌యానికి వ‌స్తే బాల‌య్య 30 – 35 మ‌ధ్య‌లో యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు ఆవేశంతో చేసిన గొడ‌వ‌ల కార‌ణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. అలా జైలు నుంచి అరవై ఏళ్ల వయసులో రిలీజ్ అయ్యాక బాల‌య్య కెరీర్ ఎలా మారింది.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్న సంఘ‌ట‌న‌ల‌తోనే ఈ సినిమా స్టోరీ న‌డుస్తుందంటున్నారు.

స్టోరీ అయితే చాలా ఆస‌క్తిగా ఉంది. ఇటు బాల‌య్య‌, అటు అనిల్ ఇద్ద‌రూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. కాజ‌ల్‌, శ్రీలీల లాంటి క్రేజీ హీరోయిన్లు. ఏదేమైనా ఈ సినిమా విష‌యంలో హైప్ మామూలుగా లేదు. మ‌రి రేపు రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ హిట్ అవుతుందో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news