సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మని చూసుకోవాలని ప్రతి ముద్దుగుమ్మ కి ఉంటుంది. అయితే అది ఎంత కష్టంతో కూడుకున్న మేటర్ అనేది చాలామందికి తెలియదు. అలా తమ బొమ్మను స్క్రీన్ పై చూసుకోవాలి అంటే ఎన్నో త్యాగాలు చేయాలి .. ఎన్నో కష్టాలు అనుభవించాలి.. ఎన్నో కమిట్మెంట్లు ఇవ్వాలి . అయితే అలా ఇచ్చిన వారందరూ కూడా స్టార్ హీరోయిన్ లిస్టులో ఉన్నారా ..? అంటే లేరని చెప్పాలి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అవ్వాలని వచ్చి రకరకాల పాత్రలతో సరిపెట్టుకుంటూ రకరకాల పొజిషన్లో ఎంతో మంది ముద్దుగుమ్మలు ఉన్నారు.
ఆ లిస్ట్ లోకే వస్తుంది యాంకర్ రేష్మి. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ .. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో తన ఫిల్మీ కెరీర్ కి సంబంధించిన విషయాలను ఓపెన్ గా పంచుకుంది. టాస్క్ లో భాగంగా ఇంద్రజ ఆమెను ఓపెన్ హార్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి అంటూ “ఇండస్ట్రీలో నువ్వు ఎందుకు హీరోయిన్గా సెటిల్ అవ్వలేకపోయావు.. ఎందుకు నీకు అవకాశాలు రావడం లేదు ” అంటూ ఓపెన్ గా అడిగింది . దీంతో రష్మి సైతం చాలా బోల్ట్ గా ఆన్సర్ ఇచ్చింది .
“సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు వస్తున్నాయి ..కానీ రాత్రికి రాత్రి ఆ పాత్రలో వేరే వాళ్ళని చూస్ చూసుకుంటున్నారు. రీజన్ ఏంటో నాకు తెలియదు. సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి కొందరు చూడగానే ఒక రకమైన స్టాంప్ వేసేస్తారు . వీళ్ళు పలానా హీరోయిన్స్ గానే పనికొస్తారు. సెకండ్ హీరోయిన్స్ గానే పనికొస్తారు ..చెల్లెల పాత్రలకే పనికొస్తారు. వదిన రోల్స్ కి పనికొస్తారు ” అంటూ అలాగే నన్ను చూడగానే వాళ్లందరికీ ఈమె యాంకర్ గానే పనికొస్తుంది అన్న కాన్సెప్ట్ మదిలో తట్టేస్తుంది .. అందుకే నాకు హీరోయిన్గా అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు.. వచ్చిన అరా కొరా కూడా రాత్రికి రాత్రి వేరే వాళ్లకు పడిపోతున్నాయి” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చేసింది రష్మీ . ప్రజెంట్ ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి..!!