టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . టాలీవుడ్ కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ సూపర్ స్టార్ హీరోయిన్గా మళ్లీ తన క్రేజ్ ని సంపాదించుకుంటుంది . అయితే రీసెంట్గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసింది. ” సౌత్ ఇండస్ట్రీలో ఉండే నైతికత విలువలు ..బాలీవుడ్ ఇండస్ట్రీకి లేవని.. అక్కడ హీరోయిన్స్ ని హీరోయిన్స్ గా చూడరు “అంటూ ఘాటుగా కౌంటర్ వేసింది .
ఈ క్రమంలోనే ఇన్నాళ్లు కాజల్ ఎందుకు బాలీవుడ్ పై మాట్లాడలేదు ..? ఇప్పుడే ఎందుకు ఇలా ఘాటుగా స్పందించింది..? సౌత్ హీరోయిన్స్ ఎంతోమంది బాలీవుడ్ సెటిల్ అయ్యారు . కోట్లకు కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారు. వారు ఎవ్వరు చెప్పని చేయని కామెంట్స్ కాజల్ ఎందుకు చేసింది . అది కూడా ఇలాంటి టైం లో నా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు .
కాగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కాజల్ ఇప్పుడే నోరు విప్పడానికి కారణం కూదా ట్రెండ్ అవుతుంది. ఆమె బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేస్తే స్టార్స్ పట్టించుకోలేదు అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే గౌతమ్ కిచ్చులు ని పెళ్లి చేసుకున్న తర్వాత కాజల్ నీల్ కిచ్చులుకి జన్మనిచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోవాలని బాడీని మార్చుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేసింది. అయితే కోలీవుడ్ – టాలీవుడ్ లో వచ్చిన అన్ని అవకాశాలు బాలీవుడ్ లో రాలేదు . అసలు బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను పట్టించుకోలేదని.. ఈ కారణంగానే కాజల్ కోపంతో మొత్తం బరస్ట్ అయిపోయింది అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు . అయితే కాజల్ ఓపెన్ అప్ అవ్వడం మంచిదే కానీ..ఇటువంటి టైం లో ఇలాంటి కామెంట్స్ చేయడం ఆమె కెరీర్ కి నెగిటివ్ మార్కింగ్ పడే విషయమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!