టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా శాకుంతలం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత .. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి సీక్రెట్స్ ఓపెన్ గా చెప్పేసింది . ఈ క్రమంలోనే హోస్ట్ అడిగినా ప్రశ్నకు సమంత ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది .
పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక మీ పరిస్థితి ఎలా అనిపిస్తుంది ..? అంటూ అడగ్గా ” నిజానికి నేను ఆరు గంటల వరకు హీరోయిన్ .. ఆ తర్వాత సదాసీదా లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను ..ఇంకా మీరు పక్కాగా చెప్పాలంటే ..ఇప్పటికి నా పెట్స్ మలాన్ని నేను ఎత్తుతూ ఉంటాను ..అంత కామన్ లైఫ్ని ఇష్టపడుతూ ఉంటాను ” అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్ లో ఏ క్యారెక్టర్ మీకు బాగా ఇష్టం.. ఏ సినిమా ఇష్టం అని అడగ్గా..
” తాను చేసిన ప్రతి క్యారెక్టర్ ని ఇష్టపడతానని .. తనకి ఇష్టమే అని..కానీ అన్నిటికన్నా ఓ బేబీ సినిమాలో పాటలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా అనిపిస్తుంది “అని సమంత చాలా ఎమోషనల్ గా కామెంట్ చేసింది . ఈ క్రమంలోనే సమంతకి ఓ బేబీ పాత్ర అంతలా సూట్ అయిందా..? అందరూ ఏం మాయ చేసావే సినిమా చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేసాం మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!